గోడలకు కళ్లుంటాయ్..!: కనిపించని సీక్రెట్ కెమెరాలు

ష్ .. గోడలకు చెవులుంటాయి.. గట్టిగా మాట్లాడొద్దు’.. ఏదన్నా రహస్యం చెప్పేటప్పుడు చాలా మంది అనే మాటిది. చెవులే కాదు..గోడలకు కళ్లూ ఉంటాయ్. గోడల అవతల ఏం జరుగుతోందో కళ్లారా చూసేయొచ్చంటున్నారు బోస్టన్​ యూనివర్సిటీ సైంటి స్టులు. అందుకోసం భారత సంతతికి చెందిన్​ వివేక్ గోయల్ నేతృత్వంలోని సైంటిస్టులు ఓ డిజిటల్ కెమెరాను తయారు చేశారు. గోడలే కాదు.. చెట్టు..ఇంకేదైనా వస్తువు చాటుగా ఏముందో కూడా ఆ డిజిటల్ కెమెరాతో చూసేయొచ్చంటున్నారు. నిజానికి మనకు భూమ్మీద ఏం కనిపిస్తున్నా  అది కాంతి వల్లే. అందుకే ఆకాశంలో అల్లంత దూరంలో ఉన్న నక్షత్రాలూ కనిపిస్తాయ్. కారణం, కాంతి ప్రయాణించేందుకు ఎలాంటి అడ్డంకులూ ఉండవు కాబట్టి. మరి, వస్తువులో, గోడలో అడ్డు ఉంటే.. ఆ పజిల్ కు సమాధానమే ఈ డిజిటల్ కెమెరా.

ఓ చీకటి గదిలోని గోడకు ఈ డిజిటల్ కెమెరాను అమర్చి ప్రయోగాత్మకంగా సఫలమైంది వివేక్ బృందం. దానినే నాన్​ లైన్​ ఆఫ్ సైట్ (ఎన్​ఎల్ వోఎస్ ) అని పిలుస్తున్నారు. నిజానికి ఈ ఐడియా మొదటి ప్రపంచ యుద్ధం కాలం నాటిదే. బంకర్లు, ట్రెంచులలో దాక్కున్న శత్రు సైన్యాన్ ని పసిగట్టేందుకు అప్పుడే ఈ ఆలోచన చేశారు. అలా వచ్చిందే పెరిస్కోప్. అందుకు రెండు లెన్సులను వాడతారు. బంకర్ల నుంచి బయటకు రాకుండానే పెరిస్కోపును బయటకు పెట్టి ఎవరున్నారో తెలుసుకోవచ్చు. అందులో బయటకు వచ్చిన లెన్సుపై వెలుతురు పడి అక్కడ ఎవరున్నారో కింద ఉన్న లెన్సుకు చేరుతుంది. ఇప్పుడు వివేక్ టీం కూడా అదే పద్ధతిని ఈ డిజిటల్ కెమెరా కోసం వాడుకుంది. అయితే లెన్సులకు బదులు గోడపై పడిన కాంతి కిరణాలను ఉపయోగించుకున్నారు. అలా ప్రతిబింబించిన (రిఫ్లెక్ట్​ అయిన) కాంతితో గోడ అవతల మన కంటి కి కనిపించని దృశ్యాలను ఎల్ ఈడీ స్క్రీన్​పై ప్రొజెక్ట్​ చేయగలిగారు.

గోడపై పడిన కాంతి అన్ని మూలలకు వెళ్లిపోతుందని, అలాంటప్పుడు అవతల ఏం జరుగుతుందో తెలుసుకోవడం కష్టమని చెప్పారు వివేక్. అదే ఓ పలుచని అడ్డు అనుకోండి కాంతి తరంగాలు సరాసరి దాని నుంచి వెళ్లిపోతాయని, అప్పుడు అవతలివైపు ఏం జరుగుతోందో తెలుసుకోవచ్చని అన్నారు. గోడల వెనకాల ఏం జరుగుతోందో తెలుసుకోవడం మామూలు కంటికి కష్టమని, కెమెరా సెన్సర్లతో తెలుసుకోవడం చాలా సులువని అన్నారు. ఎరుపు, ఆకుపచ్చ, నీలం వంటి ప్రాథమిక రంగులను క్యాప్చర్ చేసే డిజిటల్ కెమెరాతో ఫీట్ ను  అధిగమించామన్నారు. ఓ వస్తువుకు సంబంధించిన నీడలు, మసక వెలుతురులతో చాటుగా ఉన్న వస్తువుల సమాచారాన్ని తెలుసుకోగలిగామన్నారు. అలా గోడ అవతల పెట్టిన నాలుగు వస్తువులను విజయవంతంగా LED స్క్రీన్లపై వచ్చేలా చేశారు. ఒకే ఒక్క నిమిషంలో అక్కడ ఉన్నవాటిని గుర్తించగలిగారు. ఆ వస్తువులు సరైన ప్లేస్ మెంట్లలో లేకపోయినా వాటి నీడల ఆధారంగా ఈ ఆల్గారిథం ఆ వస్తువును గుర్తుపట్టేస్తుందని వివేక్ చెప్పారు. దీన్ని కంప్యూటే షనల్ పెరిస్కోపీ అని బ్రిటన్​లోని యూనివర్సిటీ ఆఫ్ గ్లా స్గో ప్రొఫెసర్ డేనియల్ ఫాషియో చెప్పారు. వస్తువుపై పడిన కాంతి ఆధారంగా పెరిస్కోప్ పనిచేస్తుందని, కానీ, వివేక్ బృందం చేసిన పరిశోధనలో చాటున దాగిన వస్తువు కాంతే నేరుగా ప్రతిబించించిందని అన్నారు.

Latest Updates