డాక్టర్‌పై యువతి ఆరోపణ : కాపాడిన సీసీ ఫుటేజ్

డాక్టర్లపై పేషెంట్లు కంప్లయింట్లు చేయడం అక్కడక్కడా జరుగుతున్నదే. తప్పుడు వైద్యం చేశాడనీ.. తప్పుగా ప్రవర్తించాడని డాక్టర్లపై పేషెంట్లు ఆరోపణలు చేసిన సందర్భాలు చాలానే జరుగుతున్నాయి. వరంగల్ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లోనూ ఇలాంటిదే ఓ సంఘటన బయటకొచ్చింది. పరీక్షల పేరుతో డాక్టర్ అసభ్యంగా ప్రవర్తించాడని భావించి.. కుటుంబసభ్యులను తీసుకొచ్చి గొడవ చేసింది ఓ యువతి. తర్వాత పోలీసులకు కంప్లయింట్ ఇచ్చింది. పోలీసులు హాస్పిటల్ కు వెళ్లి దర్యాప్తు చేశారు. సీసీ ఫుటేజ్ ను గమనించారు. సీసీ కెమెరాల్లో రికార్డైన విజువల్స్ చూసి ఆమె చేసిన ఆరోపణలను తప్పు అని ధ్రువీకరించుకున్నారు. డాక్టర్ కు క్లీన్ చిట్ ఇచ్చి అక్కడినుంచి వెళ్లిపోయారు.

Latest Updates