శశికళ ఉన్న జైల్లో సోదాలు.. బయటపడ్డ ఫోన్లు, కత్తులు

జైలు గదుల్లో సోదాలు చేసిన బెంగుళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులకు ఆ గదుల్లో ఉన్న వస్తువులు చూసి షాకయ్యారు.  మొబైల్ ఫోన్లు,  సిమ్ కార్డులు, కత్తులు, మాదక ద్రవ్యాలు, గంజాయి పీల్చే పైపులు ఇంకా నిషేధించిన వస్తువులు ఆ గదుల్లో ఉన్నాయి. కర్ణాటకలోని పరాప్పన అగ్రహార జైలు పై పలు కంప్లయింట్లు రావడంతో పోలీసు అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు.   తెల్లవారుజామున 5 గంటల సమయంలో జరిపిన ఈ రైడ్ లో 60 మంది సీసీబీ అధికారుల బృందం పాల్గొంది.

ఈ సోదాలపై క్రైమ్ పోలీస్ జాయింట్ కమీషనర్ సందీప్ పాటిల్ మాట్లాడుతూ.. తమకు ఈ జైలుపై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా తనిఖీలు నిర్వహించామని, ఈ దాడుల్లో దొరికిన మొబైల్ ఫోన్లను,  సిమ్ కార్డులను, కత్తులను సీజ్ చేశామని చెప్పారు. జైలు గదుల్లోకి మరణాయుధాలు, మాదక ద్రవ్యాలు ఎలా వచ్చాయన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు కర్ణాటకలో 40 ఎకరాలలో విస్తరించి ఉన్న అతిపెద్ద జైలు. 810 బ్యారక్‌లు ఉన్న ఈ జైలులో 4,000 మందికి పైగా ఖైదీలు ఉన్నారు. AIADMK(అఖిల భారత మాజీ అన్నా ద్రవిడ మున్నేత కజగం) జనరల్ సెక్రటరీ వి.కె. శశికళ ప్రస్తుతం ఈ జైలులోనే ఖైదీగా ఉన్నారు.

Latest Updates