డాలర్ భాయ్ ని అరెస్ట్ చేసిన CCS పోలీసులు

కొద్ది రోజుల కిందట ఓ యువతి తనపై 139 మంది అత్యాచారం చేశారంటూ మీడియా ముందుకు రావడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. దీనిపై ఆమె పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేసింది. అయితే కొన్నిరోజుల తర్వాత అదే యువతి మాట మార్చి తనతో డాలర్ భాయ్ అనే వ్యక్తి అలా చెప్పమన్నాడంటూ మాట మార్చింది. డాలర్ భాయ్ తన కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడని, అతడో సైకో అని ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ఫొటోలు మార్ఫింగ్ చేసి వేధింపులకు పాల్పడుతున్నాడని ఆమె ఆరోపించింది.

దీంతో  ప్రత్యేక దర్యాప్తు కోసం  పంజాగుట్ట పోలీసులు  ఈ కేసును CCS కు బదిలీ చేసింది. దర్యాప్తు చేపట్టిన CCS పోలీసులు ..అప్పటికే పరారీలో ఉన్న రాజశ్రీకర్ రెడ్డి అలియాస్ డాలర్ బాయ్‌ను పట్టుకునే పనిలో ఉన్నారు. గోవాలో ఉన్న డాలర్ భాయ్ ఇవాళ (శుక్రవారం) పోలీసులకు పట్టుబడ్డాడు. శుక్రవారం అతన్నిహైదరాబాద్ నాంపల్లి కోర్టుకు తరలించారు. ఆ తర్వత రిమాండ్ కు తరలించే అవకాశాలున్నాయి. అయితే ఇప్పటికే ఆ యువతి ఫిర్యాదు నేపథ్యంలో పలువురిని పోలీసులు అరెస్టులు చేశారు.

Latest Updates