ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం

హైదరాబాద్: నేరాల నియంత్రణ లో సీసీ కెమెరాలు కీలకంగా పని చేస్తాయని, ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని అన్నారు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్. నగరంలోని బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో శ్రీ వెంకటేశ్వర కోపరెటివ్ హౌసింగ్ బిల్డింగ్ సోసైటీ ఆధ్వర్యంలో రూ.55లక్షల తో125 సీసీ కెమెరాలను  ఏర్పాటు చేశారు హౌసింగ్ సోసైటీ సభ్యులు.  హైదరాబాద్ సీపీ అంజనికుమార్ బుధవారం  ఈ కార్యక్రమంలో పాల్గొని కంట్రోల్ రూం ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. “దేశంలో సేఫ్టీ, సెక్యూరిటీ అనేది చాలా ముఖ్యమైనది. సేఫ్ అండ్ సెక్యూరిటీ లో సీసీ కెమెరాలు చాలా ముఖ్యమైనవి. కేసు ఇన్వెస్టిగేషన్ లో సీసీ కెమెరాలు కీలకంగా పని చేస్తాయి. ప్రతి ఒక్కరూ ఇంటి ముందు సీసీ కెమెరాలు పెట్టుకోవాలి.  పోలీస్ ,పబ్లిక్ కలిస్తేనే క్రైమ్ కంట్రోల్ లో ఉంటుంది. ప్రతి సోసైటీ ల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి” అని అన్నారు.

Latest Updates