ఘనంగా ఆర్మీడే: యుద్ధవీరులకు మహాదళపతి నివాళి

ఢిల్లీలో ఆర్మీడే ఘనంగా జరిగింది. నేషనల్ వార్ మెమోరియల్ దగ్గర చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ (csd) బిపిన్ రావత్ తో పాటు త్రివిధ దళాల అధిపతులు యుద్ధ వీరులకు నివాళులర్పించారు. ఆర్మీ పరేడ్ గ్రౌండ్ లో సైనికుల గౌరవ వందనం స్వీకరించిన తర్వాత జవాన్లకు పతకాలు ప్రదానం చేశారు ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవానే. మీడియాతో మాట్లాడిన ఆయన.. ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తే లేదని అన్నారు. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయంతో ఉగ్రవాదానికి చెక్ పడిందని పాకిస్తాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ వెళ్లిందని అన్నారు. జమ్మూకశ్మీర్ అభివృద్ధి జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.


ఆర్మీ చీఫ్ నివాసంలో ఎట్ హోం కార్యక్రమం..
ఆర్మీడే సందర్భంగా ఆర్మీ చీఫ్ తన నివాసంలో ఎట్ హోం కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధాని మోడీ, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జవాన్ల కుటుంబాలను కలుసుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శనను చూశారు. ఈసారి ఆర్మీడే పరేడ్ కు పంజాబ్ కు చెందిన మహిళా కెప్టెన్ తానియా షెర్గిల్ లీడ్ చేశారు. తానియాకు పంజాబ్ సీఎం శుభాకాంక్షలు తెలిపారు. 1949లో కరియప్ప … ఫ్రాన్సిస్ బుచెర్ నుంచి కమాండర్ ఇన్ చీఫ్ బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ఆర్మీ డేగా పాటిస్తూ… అమరులైన జవాన్లకు నివాళులు అర్పిస్తున్నారు.

Latest Updates