
ముంబై: పూర్తిగా మహిళలతోనే నడిచే సర్వీస్ సెంటర్‌ను టైర్ల తయారీ కంపెనీ సియెట్ సోమవారం ఓపెన్ చేసింది. పంజాబ్‌లోని బటిండాలో ఈ సెంటర్‌ను కంపెనీ ఓపెన్ చేసింది. రానున్న కొన్ని నెలల్లో ఇలాంటి 10 షాప్‌లను దేశం మొత్తం మీద తెరుస్తామని సియెట్ ఓ స్టేట్మెంట్లో పేర్కొంది. ఈ షాప్‌లలో అన్ని రకాల సర్వీస్ రిలేటెడ్ వర్క్‌ను మహిళలే చూస్తారు. వీల్‌ను మార్చడం, బ్యాలెన్షింగ్, వెహికల్ సర్వీస్‌లలో వివిధ రకాల మెషినరీని ఆపరేటింగ్ చేయడం వంటివి ఇందులో ఉన్నాయని కంపెనీ తెలిపింది. ఈ షాపులు కస్టమర్ సర్వీస్ సెంటర్లగా పనిచేస్తాయని పేర్కొంది. కరోనా సంక్షోభం వలన చాలా మంది జాబ్స్ కోల్పోయారని, ఈ షాప్‌లను ఓపెన్ చేయడం ద్వారా సియెట్ కొత్త ఉద్యోగాలను క్రియేట్ చేస్తోందని పేర్కొంది. ముఖ్యంగా ఈ జాబ్‌లను మహిళలకు ఇస్తోందని తెలిపింది.