ఏపీ సీఎస్ బదిలీ .. కొత్త సీఎస్ గా ఎల్వీ సుబ్రహ్మణ్యం

ఏపీలో ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠాను బదిలీ చేసింది. కొత్త సీఎస్ గా 1983 బ్యాచ్ కు చెందిన ఎల్వీ సుబ్రహ్మణ్యంను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పునేఠాను ఎన్నికలకు సంబంధం లేని శాఖలో నియమించాలని ఆదేశించింది. శనివారం కొత్త  సీఎస్ గా ఎల్వీ సుబ్రహ్మణ్యం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇటీవల రాష్ట్రానికి చెందిన ముగ్గురు ఐపీఎస్ అధికారుల బదీలపై సీఈసీ సిరియస్ అయ్యింది.