65వ ఏట అడుగుపెట్టనున్న లోకనాయకుడు

డిఫరెంట్‌‌ గెటప్స్‌‌కి కేరాఫ్‌‌ ఆయన.  ఇండియన్ సినిమాలో ఏ యాక్టర్‌‌ కూడా చేయనన్ని ఎక్స్‌‌పరిమెంట్స్‌‌ చేశాడు. ఆస్కార్ రేంజ్ యాక్టింగ్‌‌తో ఉత్తమ నటుడిగా కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు.  ‘ఉళగనాయగన్‌‌’, ‘లోకనాయకుడు’, ‘యూనివర్సల్ హీరో’..
ఏ భాషలో  పిలుచుకున్నా సరే సిల్వర్‌‌స్క్రీన్‌‌కి ఆయనొక లెజెండ్‌‌.  అరవై ఏళ్ల  సినీ జర్నీ పూర్తి చేసుకోవడంతో  పాటు.. 65వ ఏట అడుగుపెడుతున్న  కమల్‌‌ హాసన్‌‌ యాక్టింగ్‌‌ కెరీర్‌‌పై ఓ కంప్లీట్‌‌ లుక్‌‌.

యాక్టింగ్‌‌‌‌.. కొందరి బ్లడ్‌‌‌‌లోనే ఉంటుంది.  మరికొందరు ఎలాంటి బ్యాక్‌‌‌‌ గ్రౌండ్ లేకపోయినా యాక్టింగ్‌‌‌‌ టాలెంట్‌‌‌‌తో పైకి వస్తారు.  ఇంకొందరికి మాత్రం యాక్టింగ్‌‌‌‌ అలవోకగా అబ్బుతుంది.   ఆ ఇంకొందరిలో సీనియార్టీ ఉన్న యాక్టర్ కమల్‌‌‌‌ హాసన్‌‌‌‌.   వయసు అరవై నాలుగేళ్లైతే .. అందులో 60 ఏళ్ల సినీ ప్రయాణం ఆయనది.

ఈ జర్నీలో ఎన్నో అప్‌‌‌‌ అండ్‌‌‌‌ డౌన్లు.  చిన్న గ్యాప్ తప్ప..  బ్రేకులు ఎక్కడా పడలేదు. జనరేషన్‌‌‌‌కి తగ్గట్లుగా అప్‌‌‌‌డేట్‌‌‌‌ అయ్యే కమల్‌‌‌‌, యాక్టింగ్ పిరియడ్‌‌‌‌ను నాలుగు స్టేజ్‌‌‌‌లుగా డివైడ్‌‌‌‌ చేయవచ్చు.

తండ్రి ఒక లాయర్‌‌‌‌.  అమ్మ హౌజ్‌‌‌‌ వైఫ్.  సంప్రదాయ కుటుంబం కమల్‌‌‌‌ది. ఇంట్లో ఎవరికీ యాక్టింగ్‌‌‌‌ టచ్‌‌‌‌ లేదు.  అనుకోకుండా ఒకరోజు తల్లి ఫ్రెండ్‌‌‌‌తో పాటు ఏవీఎం స్టూడియోకి వెళ్లిన కమల్‌‌‌‌కి సినిమా ఛాన్స్‌‌‌‌ దక్కింది. ‘కలాత్తూర్​ కణ్ణమ్మ’తో(1960), (తెలుగులో ‘మూగనోము’గా రీమేక్‌‌‌‌ అయ్యింది) నాలుగేళ్ల వయసులోనే చైల్డ్‌‌‌‌ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చాడు కమల్‌‌‌‌.  సినిమా రిలీజ్‌‌‌‌ అయ్యేనాటికి అతనికి ఐదేండ్లు నిండాయి.  బేసిక్‌‌‌‌ ట్రైనింగ్‌‌‌‌తోనే అద్భుతంగా యాక్ట్‌‌‌‌ చేశాడు బుజ్జి కమల్‌‌‌‌.  ఇది అతని పేరెంట్స్‌‌‌‌కి కూడా ఒక సర్‌‌‌‌ప్రైజ్‌‌‌‌.  ఆ వయసు నుంచి  కమల్‌‌‌‌ ముఖానికి అంటుకున్న మేకప్‌‌‌‌.. ఆయనలోని నట కోణాలెన్నింటినో వెలికి తీసింది. మధ్యలో చదువు కోసం కొద్దిగా విరామం తీసుకున్నప్పటికీ..  ఫస్ట్‌‌‌‌ స్టేజీలో చైల్డ్‌‌‌‌ ఆర్టిస్టుగా మొత్తం పద్నాలుగు సినిమాల్లో  యాక్ట్‌‌‌‌ చేశాడు. అంతేకాదు తన అన్నలు కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి కమల్‌‌‌‌ ఒక ఇన్‌‌‌‌స్పిరేషన్‌‌‌‌ అయ్యాడు.

పర్‌‌‌‌ఫార్మెన్స్‌‌‌‌ పిరియడ్‌‌‌‌

వందల మంది దర్శకులతో పని చేసినప్పటికీ కమల్‌‌‌‌కి బాలచందర్‌‌‌‌, విశ్వనాథ్‌‌‌‌లతోనే ఎక్కువ అనుబంధం ఉంది. ఎందుకంటే కంప్లీట్‌‌‌‌ హీరోగా ఆయన్ని నిలబెట్టింది ఈ ఇద్దరు స్టార్​ డైరెక్టర్లే కాబట్టి. హీరోలలో శివాజీ గణేషన్‌‌‌‌తో, ఆయన ఫ్యామిలీతో కమల్‌‌‌‌కి బాండింగ్‌‌‌‌ ఎక్కువ.  చైల్డ్‌‌‌‌ ఆర్టిస్ట్‌‌‌‌గా కెరీర్ ముగిశాక వచ్చిన ఏ ఒక్క చాన్స్‌‌‌‌ని కూడా కమల్‌‌‌‌ వదులుకోలేదు.  రైటర్‌‌‌‌గా, డాన్స్‌‌‌‌ మాస్టర్‌‌‌‌గా, ఫైట్‌‌‌‌ మాస్టర్‌‌‌‌గా ఎన్నో సినిమాలకు పని చేశాడు.  అలాంటి టైంలోనే సోలో హీరోగా కమల్‌‌‌‌ను నిలబెట్టింది మలయాళం మూవీ ‘కన్యాకుమారి’(1974). అయితే కె. బాలచందర్ డైరెక్ట్‌‌‌‌ చేసిన ‘అపూర్వ రాగంగళ్‌‌‌‌’తో తమిళంలో హీరోగా కమల్‌‌‌‌కి గుర్తింపు దక్కింది. ఈ సినిమాతోనే సూపర్‌‌‌‌ స్టార్‌‌‌‌ రజనీకాంత్‌‌‌‌ సిల్వర్‌‌‌‌ స్క్రీన్‌‌‌‌కి పరిచయం అయ్యాడు కూడా. అప్పటి నుంచి గురువు బాలచందర్‌‌‌‌ ప్రోత్సాహంతో కమల్‌‌‌‌–రజనీల కెరీర్‌‌‌‌ పోటాపోటీగా సాగింది. ఈ సెకండ్‌‌‌‌ స్టేజీలో కమల్‌‌‌‌ యాక్టింగ్ కెరీర్‌‌‌‌ ఇతర లాంగ్వేజ్‌‌‌‌ల్లోకి పాకింది.  కోలీవుడ్‌‌‌‌తో పాటు ‘అంతులేని కథ’, ‘మరో చరిత్ర’ సినిమాలతో తెలుగులో, ‘ఏక్‌‌‌‌ దూజే కే లియే’, ‘గిరఫ్తార్​’, ‘రాజ్‌‌‌‌ తిలక్‌‌‌‌’ సినిమాలతో బాలీవుడ్‌‌‌‌లోనూ  ఐడెంటిటీ దక్కించుకున్నాడు కమల్‌‌‌‌.

అవార్డులు వాటికవే..

చైల్డ్‌‌‌‌ ఆర్టిస్ట్‌‌‌‌గా తొలి సినిమాకే కమల్‌‌‌‌కి రాష్ట్రపతి గోల్డ్‌‌‌‌ మెడల్‌‌‌‌ దక్కింది.  హీరోగా కూడా తొలి సినిమా ‘కన్యాకుమారి’తోనే ఫిల్మ్‌‌‌‌ ఫేర్‌‌‌‌ అవార్డు అందుకున్నాడు. 1979లో తమిళనాడు సర్కార్‌‌‌‌ ‘కలైమామణి’ అవార్డుతో ఆయన్ని సత్కరించింది. ఇప్పటిదాకా జాతీయ స్థాయిలో మూడు సార్లు ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నాడు కమల్ హాసన్.  సినీ కెరీర్‌‌‌‌లో ఇప్పటివరకు మొత్తం 171 అవార్డులు పొందాడు.  అందులో 18 ఫిలిం ఫేర్ లున్నాయి.  ఆసియా ఫిలిం ఫెస్టివల్ బెస్ట్ యాక్టర్‌‌‌‌గానూ నిలిచాడు. పద్మశ్రీ( 1990లో), పద్మభూషణ్‌‌‌‌( 2014లో) కూడా ఆయన్ని వరించాయి. ‘స్వాతి ముత్యం, సాగర సంగమం, ఇంద్రుడు చంద్రుడు’.. సినిమాలకు నంది అవార్డులు అందుకున్నాడు. ఒక పరభాష నటుడికి తెలుగులో మూడుసార్లు బెస్ట్‌‌‌‌ యాక్టర్‌‌‌‌ అవార్డు రావడం విశేషం.

కమల్‌‌‌‌ హాసన్‌‌‌‌ డెడికేషన్‌‌‌‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తెరపై చూస్తున్నంత సేపు ఆ క్యారెక్టర్‌‌‌‌లో కమల్‌‌‌‌ని తప్ప వేరే యాక్టర్‌‌‌‌ని ఊహించుకోవడం కష్టం.  క్యారెక్టర్ ఏదైనా సరే  ఫిజికల్‌‌‌‌గా, సైకలాజికల్‌‌‌‌గా దానిని బాగా స్టడీ చేసి ఓన్‌‌‌‌ చేసుకుంటాడు. అందుకే సినీ ఇండస్ట్రీ మొత్తం ఆయన్ని ఒక యాక్టింగ్ లైబ్రరీగా అభివర్ణిస్తుంది.  ఆ గొప్పదనమే ఎందరో యాక్టర్లకు కమల్‌‌‌‌ని ఇన్‌‌‌‌స్పిరేషన్‌‌‌‌ని చేసింది.

కమల్‌‌‌‌ యాక్ట్‌‌‌‌ చేసిన వాటిల్లో 33 కామెడీ సినిమాలు బ్లాక్‌‌‌‌ బస్టర్లు. వాటిల్లో  పుష్పక విమానం.. కమల్ కెరీర్‌‌‌‌లోనే ఒక స్పెషల్ సినిమా.  ఇండియన్‌‌‌‌ సినిమాను తిరోగమనం చేయించి మరీ మూకీ సినిమా తీశాడు దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు.  స్లాప్‌‌‌‌స్టిక్‌‌‌‌ హ్యూమర్‌‌‌‌(ఫిజికల్‌‌‌‌ యాక్టివిటీస్‌‌‌‌తో కామెడీ జనరేట్‌‌‌‌ చేయడం)తో తెరకెక్కిన ‘పుష్పక విమాన’(తెలుగులో పుష్పక విమానం) దాదాపు అన్ని ఏరియాల్లో సూపర్‌‌‌‌ హిట్ అయ్యింది. ఒక రిచ్​ తాగుబోతు ప్లేస్​లో ఒక నిరుద్యోగి లగ్జరీ హోటల్‌‌‌‌లో దిగడం, అక్కడ ఒక అమ్మాయిని ప్రేమలోకి దించడం, పరిస్థితులు ఆ నిరుద్యోగిలో మార్పు తీసుకురావడం, తన తప్పు గుర్తించి మళ్లీ తన పాత ఐడెంటిటీకి మారిపోవడం, చివరికి ప్రేయసికి దూరం కావడం.. కథ మొత్తం సీరియస్‌‌‌‌గానే ఉన్నప్పటికీ పిక్చరైజేషన్‌‌‌‌ మాత్రం హిలేరియస్‌‌‌‌గా ఉంటుంది. ఈ మూవీ వచ్చి 30 ఏళ్లు గడిచినా.. ఇప్పటికీ ఈ తరహాలో తీసే ధైర్యం మరే దర్శకుడు చేయకపోవడం విశేషం. అలాగే ‘నాయకన్‌‌‌‌’లో కమల్ అద్భుతంగా నటించాడు. బయోగ్రఫికల్ స్కెచ్ గా సాగే ఈ మూవీలో.. అన్ని ఏజ్‌‌‌‌ల క్యారెక్టర్లను పోషించాడు. అందుకే ఈ సినిమా.. ఆస్కార్‌‌‌‌ దాకా వెళ్లడంతో పాటు టైమ్ మేగజీన్‌‌‌‌ వారి ‘ఆల్ టైం బెస్ట్’ హండ్రెడ్ మూవీస్‌‌‌‌లో ఒకటిగా నిలిచింది.

డెబ్భైవ దశకం చివరి నుంచి 90వ దశకం మధ్య దాకా చాలా వరకు సీరియస్‌‌‌‌ కథల్లోనే కమల్‌‌‌‌ యాక్ట్ చేశాడు. పర్‌‌‌‌ఫార్మెన్స్‌‌‌‌ బేస్డ్‌‌‌‌ సినిమాలు కమల్‌‌‌‌ ఫేమ్‌‌‌‌ను మరింత పెంచాయి.  తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ(కవిత సినిమా ఒక్కటే).. భాషల్లో కమల్‌‌‌‌ గ్యాప్‌‌‌‌ తీసుకోకుండా వరుసబెట్టి సినిమాలు చేశాడు.  జెట్‌‌‌‌ స్పీడ్‌‌‌‌తో వంద సినిమాల మైలు రాయిని దాటాడు.  తమిళ్‌‌‌‌లో ‘గురు, టిక్‌‌‌‌ టిక్‌‌‌‌ టిక్‌‌‌‌, ముంద్రమ్‌‌‌‌ పిరై(తెలుగు డబ్‌‌‌‌ వసంత కోకిల), నాయకన్‌‌‌‌(తెలుగు డబ్‌‌‌‌ నాయకుడు), అపూర్వ సగోదర్‌‌‌‌గల్‌‌‌‌
(విచిత్ర సోదరులు), గుణ, తేవర్ మగన్‌‌‌‌(తెలుగు డబ్‌‌‌‌ క్షత్రియ పుత్రుడు), మహానది.. తెలుగులో అందమైన అనుభవం, ఆకలి రాజ్యం, సాగర సంగమం,  స్వాతి ముత్యం, ఇంద్రుడు చంద్రుడు, మలయాళంలో ‘చాణక్యన్‌‌‌‌’,  కన్నడలో ‘కోకిల’ లాంటి సినిమాలు కమల్‌‌‌‌ని ఆయా భాషల ప్రేక్షకులకు దగ్గర చేశాయి.  లవ్ స్టోరీలు, సస్పెన్స్‌‌‌‌–సోషల్ డ్రామాలు, సెంటిమెంట్‌‌‌‌ కథలు హీరోగా కమల్‌‌‌‌ రేంజ్‌‌‌‌ని ఖండాంతరాలు దాటించాయి.

కామెడీ కమ(మా)ల్‌‌‌‌

కమల్‌‌‌‌ హాసన్‌‌‌‌ కామెడీ టైమింగ్‌‌‌‌ మామూలుగా ఉండదు. ఆయన  సినిమాల్లో ఎక్కువ మందికి కనెక్ట్‌‌‌‌ అయినవి, టక్కున గుర్తుకు వచ్చేవి కూడా కామెడీ సినిమాలే.  80లో వచ్చిన సినిమాలో కామెడీ డోస్‌‌‌‌ ఉన్నప్పటికీ ఆడియెన్స్‌‌‌‌కి అవి అంతగా మెప్పించలేకపోయాయి.  అయితే కమల్‌‌‌‌ యాక్టింగ్‌‌‌‌లోని మూడో స్టేజీలో కంప్లీట్‌‌‌‌ ఎంటర్‌‌‌‌టైన్‌‌‌‌ సినిమాలు వచ్చాయి. ‘మైకేల్‌‌‌‌ మదన కామ రాజు, మగలిర్ మట్టుమ్‌‌‌‌(తెలుగు డబ్‌‌‌‌ ఆడవాళ్లకు మాత్రమే), సతీ లీలావతి, అవ్వై షణ్ముగి(తెలుగు డబ్ భామనే సత్యభామనే), కాదలా కాదలా(తెలుగు డబ్‌‌‌‌ నవ్వండి లవ్వండి), తెనాలి, పమ్మల్‌‌‌‌ కె. సంబంధం(తెలుగు డబ్‌‌‌‌ బ్రహ్మచారి), పంచతంత్రం, ముంబై ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌, మన్మథ బాణం’ సినిమాలు తెలుగు, తమిళ రాష్ట్రాల ఆడియెన్స్‌‌‌‌ని కడుపుబ్బా నవ్వించాయి.  ఏళ్లు గడిచినా ఇప్పటికీ ఆ సినిమాలుఅలరిస్తుంటాయి.  అదే టైంలో  ‘ఇండియన్‌‌‌‌, హే రామ్‌‌‌‌, అభయ్‌‌‌‌, అన్బె శివన్‌‌‌‌, విరుమాండి(తెలుగు డబ్‌‌‌‌ పోతురాజు), ’ లాంటి సీరియస్‌‌‌‌ సినిమాలు ఈ పిరియడ్‌‌‌‌లోనే ప్రేక్షకుల్ని మెప్పించాయి.

కమల్ రొమాన్స్‌‌‌‌లో కింగ్‌‌‌‌.  కామెడీ చేస్తూనే కంటతడి పెట్టించగల కెపాసిటీ ఉంది.  తన పోర్షన్‌‌‌‌ని చాలా వరకు తానే కంపోజ్‌‌‌‌ చేసుకుని డైరెక్టర్లకు, ఇతర టెక్నీషియన్లకు పెద్దగా శ్రమ లేకుండా చేస్తుంటాడు. అందుకే కమల్ ఒక కంప్లీట్ యాక్టర్‌‌‌‌.  కాంట్రవర్సీలను సైతం ఆయన లెక్క చెయ్యడు.  కమల్‌‌‌‌ కెరీర్‌‌‌‌లో ఎన్నో స్పెషల్ సినిమాలున్నాయి.  డబుల్, ట్రిపుల్‌‌‌‌ క్యారెక్టర్‌‌‌‌ సినిమాలే కాదు.. ‘మైకేల్‌‌‌‌ మదన కామ రాజు’తో  ‘క్వాడ్రుప్లేట్స్‌‌‌‌’(ఒకే కాన్పులో నలుగురు పిల్లలు), ‘దశావతారం’లో ఏకంగా పది క్యారెక్టర్లు చేసి ఆకట్టుకున్నాడు.  రెండు వందల పైగా సినిమాల్లో యాక్ట్‌‌‌‌ చేసిన కమల్‌‌‌‌ స్వతహాగా  హేతువాది(రేషనలిస్ట్​). ఆ విషయాన్ని చెప్పుకునేందుకు
‘అన్బె శివన్‌‌‌‌’(తెలుగు డబ్‌‌‌‌ సత్యమే శివం), ‘దశావతారం’ సినిమాల్ని ఉదాహరణలుగా చూపిస్తాడాయన.  కమల్‌‌‌‌ యాక్ట్‌‌‌‌ చేసిన ఆరు సినిమాల్ని.. ఆస్కార్ అవార్డుకు పంపించారు. భారతదేశంలో ఏ యాక్టర్‌‌‌‌కి ఇప్పటివరకు ఈ గౌరవం దక్కలేదు.

Latest Updates