టీమిండియా చరిత్రలో మరచిపోలేని రోజు

భారత క్రికెట్ ప్రేమికులు మరచిపోని రోజు ఇది.. టీమిండియా తన పేరును సువర్ణాక్షరాలతో రాసుకున్న రోజు ఇది…. కపిల్ డెవిల్స్ తమ సత్తాచాటి ప్రపంచ కప్ ను ముద్దాడిన రోజు ఇది.. అప్పటికి మనం ఇంకా పసికూనలమే… వెస్టిండిస్ లాంటి దిగ్గజ ఆటగాళ్ల ముందు భారత్ ను ఎవరూ గుర్తించలేదు. అలాంటి వెస్టిండిస్ నే ఫైనల్ బ్యాటిల్ లో ఎదుర్కొని మువ్వన్నెల జెండాను ఎగురేసింది కపిల్ డెవిల్స్.

ఇప్పటికి సరిగ్గా 36 ఏళ్లు…  ఇంగ్లండ్ గడ్డపై ప్రపంచకప్ ఆడటానికి భారత్ బయలుదేరింది. కపిల్ కెప్టెన్సీలో ఆడిన మొదటి మ్యాచ్ లోనే భారత్ ఓడింది. ఆ అయినా పట్టువదలకుండా ఫైనల్ వరకు చేరింది భారత్. తీరా చూస్తే ఫైనల్ లో వెస్టిండిస్. భీకర ఫామ్ లో ఉన్న వెస్టిండిస్ టీం ముందు భారత్ గెలుస్తుందని ఎవరూ అనుకోలేదు. అప్పటికే విస్టిండిస్ ప్లేయర్లందరూ గెలుస్తామన్న ధీమాతో షాంపెన్ బాటిల్స్ తెచ్చుకున్నారు. భారత్ జట్టులో మాత్రం కేవలం కపిల్ దేవ్ మాత్రమే షాంపెన్ బాటిల్ ను తెచ్చుకున్నాడు. గెలుస్తామన్న ధీమానా.. లేక మరేమైనానా తెలువదు కాని కపిల్ తనపై తన జట్టుపై ఉన్న నమ్మకాన్ని ధైర్యాన్ని ఇది సూచిస్తుంది.

లార్డ్స్ మైదానంలో ఫైనల్ మ్యాచ్ మొదలైంది……టాస్ గెలిచి వెస్టిండిస్ ఫీల్డింగ్ తీసుకుంది… ఆట షురూ అవగానే భారత్ కు దక్కా తాకింది. గవస్కర్ రెండు రన్స్ కే అవుటయ్యాడు. దీంతో శ్రీకాంత్, మోహిందర్ అమర్ నాథ్ పట్టువదలకుండా హాఫ్ సెంచరీ బాగస్వామ్యం నెలకొల్పారు. కలిప్ కూడా ఈ మ్యాచ్ లో నిరాశపరిచాడు. దీంతో భారత్.. కేవలం 183 పరుగులు చేసి తక్కువ టార్గెట్ ను వెస్టిండిస్ ముందు ఉంచింది. వెస్టిండిస్ గెలుపు తప్పదని అనుకున్నారు క్రికెట్ పండితులు.

వెస్టిండిస్ బ్యాటింగ్ మొదలైంది.. కపిల్ టీం జాగ్రత్తగా బౌలింగ్ వేసింది. దీంతో ఒక్కో పరుగు చేయటానికి వెస్టిండిస్ చాలా కష్టపడింది. ఆ మ్యాచ్ లో కపిల్ ఒకే వికెట్ తీసినా పరుగులు ఎక్కువ ఇవ్వలేదు. మదన్ లాల్, మోహిందర్ అమర్ నాథ్ ముడు వికెట్లు తీసి ప్రత్యర్థులను కట్టడి చేశారు. దీంతో వెస్టిండిస్ కేవలం 140 రన్స్ కే ఆల్ అవుట్ అయింది. ప్రపంచ క్రికెట్ చరిత్రలో భారత్ తన పేరును సువర్ణాక్షరాలతో రాసుకుంది. కపిల్ తెచ్చుకున్న షాంపెన్ బాటిల్ ఆకాశాన్ని ముద్దాడింది.

కప్ తో స్వదేశానికి తిరిగి వచ్చిన కపిల్ డెవిల్స్ కు అప్పటి పీఎం ఇందిరా గాంధీ స్వయంగా వెల్ కమ్ చెప్పారు. అప్పుడు పడిన విత్తనం ఇప్పుడు క్రికెట్ సామ్రాజ్యాన్ని ఏలేంత వటవృక్షంగా ఎదిగింది టీమిండియా.. ఆపై ధోనీ నాయకత్వంలో మరో సారి మనం వరల్డ్ కప్ అందుకున్నాం….  ఇంకేం ఇప్పుడు కూడా విరాట్ కెప్టెన్సీలో భారత్ మరో సారి ప్రపంచకప్ గెలుస్తుందని ఆశిద్ధాం..

Latest Updates