కాళేశ్వరం ప్రారంభంపై సెలబ్రిటీల అభినందనలు

కాళేశ్వ‌రం ప్రాజెక్ట్‌ని తెలంగాణ సీఎం కేసీఆర్, గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహాన్, ఏపీ సీఎం జ‌గ‌న్, మ‌హారాష్ట్ర సీఎం ఫ‌డ్న‌వీస్ క‌లిసి ప్రారంభించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ప్రారంభించచిన సీఎం కేసీఆర్‌పై ప్ర‌ముఖులు ప్ర‌శంస‌లు కురిపించారు. అక్కినేని నాగార్జున త‌న ట్విట్ట‌ర్ ద్వారా నీరే జీవం !! ప్ర‌పంచంలో అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేష‌న్ ప్రాజెక్ట్ ప్రారంభించినందుకు శుభాకాంక్ష‌లు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంజ‌నీర్ల అద్భుత ప్ర‌తిభ‌కి నిద‌ర్శ‌నం అని ట్వీట్ చేశారు. ర‌వితేజ కూడా త‌న ట్విట్ట‌ర్ ద్వారా కాళేశ్వ‌రం ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఫోటో షేర్ చేస్తూ అద్భుతాన్ని సాక్షాత్క‌రింప‌జేసినందుకు తెలంగాణ ప్ర‌భుత్వానికి అభినంద‌న‌లు తెలిపారు.

Latest Updates