ఈ సెలబ్రిటీల తొలి జీతం ఎంతో తెలుసా?

ముంబై: ఎవరి జీవితంలోనైనా మొదటి సంపాదన ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అది వంద కావొచ్చు వెయ్యి కావొచ్చు. ఎప్పటికీ మర్చిపోనిదే మరి. జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎన్ని కోట్లు సంపాదించినా ఫస్ట్ శాలరీ మాత్రం ఎప్పుటికీ గుర్తుండిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కోట్లు సంపాదించే సెలబ్రిటీలు అయినా, ఐదంకెల జీతం అందుకునే సాఫ్ట్‌‌వేర్ ఇంజినీర్ అయినా ఎప్పుడో ఒకప్పుడో వంద, వెయ్యి రూపాయల కోసం కష్టపడే ఉంటారు. బాలీవుడ్‌‌కు చెందిన పలువురు సెలబ్రిటీలు తమ తొలి సంపాదన వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

మీర్జాపూర్ వెబ్ సిరీస్‌‌తో తెలుగు వాళ్లకు దగ్గరైన అలీ ఫజల్‌‌తోపాటు మరో యంగ్ హీరో పుల్కిత్ సమ్రాట్, డైరెక్టర్ అనుభవ్ సిన్హా తమ ఫస్ట్ శాలరీ గురించి ట్వీట్లు చేశారు. 19 ఏళ్ల వయస్సులో తాను రూ.8 వేలను మొదటి జీతంగా అందుకున్నానని అలీ ఫజల్ చెప్పాడు.

ఏడో క్లాస్ స్కూడెంట్‌‌కు ట్యూషన్ చెప్పినందుకు తనకు రూ.80 జీతం ఇచ్చారని దర్శకుడు అనుభవ్ సిన్హా ట్వీట్ చేశాడు. అప్పుడు తన వయస్సు 18 ఏళ్లని.. ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న తాను ఆ డబ్బులతో సిగరెట్లు తాగానని చెప్పుకొచ్చాడు.

గ్యాస్ స్టేషన్ల వద్ద పెట్రో కార్డులు అమ్మడం ద్వారా రూ.1500 వేతనం అందుకున్నానని, అదే తన తొలి జీతంగా పుల్కిత్ సమ్రాట్ పేర్కొన్నాడు. అప్పుడు తన వయస్సు 16 ఏళ్లని చెప్పాడు.

Latest Updates