బ్రేక్ ఫాస్ట్ చేస్తూ నవ్వులు.. అదే వారి చివరి ఫొటో

“ఈస్టర్ బ్రేక్ ఫాస్ట్ విత్ ఫ్యామిలీ”.. అనే క్యాప్షన్ తో ఫేస్ బుక్ లో ఓ ఫొటో పోస్ట్ చేసింది నిసంగా మయదున్నే. ఆ ఫొటోనే ఆమె చివరి ఫొటో అయింది. ఫొటోలో కనిపించిన నవ్వులు… ఆ ఫ్యామిలీలో ఇపుడు కనుమరుగయ్యాయి. కొలంబోలోని హోటల్ షాంగ్రీ-లా లో ఫొటో దిగి.. ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన కొద్దిసేపటికే బాంబు పేలుడు జరిగింది. ఈ బ్లాస్ట్ లో నిసంగాతో పాటు.. ఆమె తల్లి శాంతా మయదున్నే కూడా ప్రాణాలు కోల్పోయారు.

శాంతా మయదున్నే శ్రీలంకలో ఓ సెలబ్రిటీ షెఫ్. కుక్ బుక్స్, పాపులర్ కుకరీ టీవీ షో హోస్ట్ ఆమె. బ్రిటన్ కు చెందిన ఆమె.. శ్రీలంకలో మంచి పేరుతెచ్చుకున్నారు. పేలుడు జరగడానికి ముందు.. ఆమె కూతురు నిసంగా… బ్రేక్ ఫాస్ట్ ఫొటోను ఫేస్ బుక్ లో షేర్ చేశారు. స్ఫూర్తి నింపే షెఫ్ గా… శాంతా మయదున్నేను శ్రీలంకలో ఎంతోమంది గౌరవిస్తారు. ఇపుడు వారి మరణంతో…. అభిమానులు చాలా బాధపడుతున్నారు.

నిసంగా మయదున్నే లండన్ యూనివర్సిటీలో చదివింది. HSBCలో ఉద్యోగం చేస్తోంది. బ్రిటన్ లోని వారి కుటుంబసభ్యులు ఈస్టర్ సందర్భంగా శ్రీలంకకు వచ్చారు. ఈ సమయంలోనే బ్లాస్ట్ జరిగింది.

Latest Updates