హైదరాబాద్‌లో సెల్ టవర్‌కి మంటలు

గచ్చిబౌలి,వెలుగు: హైదరాబాద్‌లో సెల్ టవర్‌కు మంటలు అంటుకుని దగ్ధమైన ఘటన గురువారం జరిగింది. రాయదుర్గం పీఎస్ పరిధిలోని ఐకియా స్టోర్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎటువంటి హాని జరగలేదు.

గచ్చిబౌలి ఐకియా స్టోర్ వెనుకాల ఉన్న నస్సార్ స్కూ ల్ సమీపంలో గురువారం సాయంత్రం 6 గంటలకు ఐడియా, ఎయిర్ టెల్ టవర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడడంతో స్థా నికులు వెంటనే పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి రెండు ఫైర్ ఇంజన్లు చేరుకొని మంటలను అర్పి వేశా-యి. ప్రమాదంలో ఆస్తి నష్టం మినహా ఎవరికీ ఏ హాని జరగలేదు. షార్ట్​ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమిక అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తు న్నారు.

Latest Updates