బస్తా సిమెంట్ ధర రూ. 400

  • మూడు నెలల్లోనే రూ.100 వరకు పెరుగుదల
  •  కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యా పారులు
  • ఏటా వేసవిలో ఇదే తంతు

సిమెంటు ధరలకు రెక్కలొచ్చాయి. బస్తా సిమెంట్ ధర జనవరిలో రూ. 300 ఉండగా.. ఇప్పుడు రూ.400కు చేరింది. వేసవి సీజన్ ను సొమ్ము చేసుకునేందుకు వ్యాపారులు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. పైసా పైసా కూడబెట్టుకొని సొంతింటికలను సాకారం చేసుకోవాలనుకునే సామాన్యుడికి ఈ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ధరల ప్రభావంతో చాలా ప్రాంతాల్లో నిర్మాణాలు నిలిచిపోయాయి. ఫలితంగా తాపీ మేస్త్రీలు, కూలీలుకూడా ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిర్మాణాలకు ఎండాకాలం అనువైన సీజన్ గా జనం భావిస్తుంటారు. ఇదే అవకాశంగా వ్యాపారులు కృత్రిమ కొరతకు తెరలేపి.. ఎడాపెడా ధరలు పెం చేస్తున్నారు. జనవరికి ముందు రూ. 250 పలికిన బస్తా సిమెంట్ .. జనవరిలోరూ. 300కు చేరిం ది. అటు తర్వాత కొన్ని రోజులకే అది రూ. 340కి చేరిం ది. అలా.. ఏప్రిల్ వచ్చేస రికి మూడు నెలల్లో ఏకంగా రూ.100 వరకు పెరిగి రూ. 400కు చేరింది.

నిర్మా రంగం కుదేలు

నిలకడగాలేని సిమెంటు ధరలతో భవన నిర్మాణంరంగం కుదేలవుతోంది. ఉదాహరణకు నిర్మల్ జిల్లాలో నిత్యం దాదాపు వెయ్యి టన్నులకు పైగా సిమెంట్ ను వివిధ నిర్మాణాలకు ఉపయోగిస్తుంటారు. గత కొన్ని రోజులుగా సిమెంటు ధరలు పెరిగిపోవడంతో చాలా చోట్ల నిర్మాణాలు ఆగిపోయాయి.అపార్ట్​మెంట్లు నిర్మించేవారు సిమెంట్ ధరలను దృష్టిలో పెట్టుకొని అపార్ట్​మెంట్ల పోర్షన్లకు కూడా ధరను పెంచి అమ్ముతున్నారు. ఇండి పెండెంట్ ఇళ్లునిర్మించి విక్రయించే వారు సైతం భారీగా ధరలు పెంచుతున్నారు.

మరింత పెరిగే చాన్స్

​గత మూడేళ్లలో వేసవిలో సిమెంట్ ధరలు పరిశీలిస్తే.. 2016లో రూ. 230 ఉండగా.. 2017లోరూ. 270కు చేరింది. 2018లో రూ. 310 వరకుపెరిగిం ది. ప్రస్తుతం అది రూ. 350 నుంచి 400వరకు పలుకుతోంది. మరో వారం రోజుల్లో రూ. 50నుంచి రూ. 80 వరకు పెరగొచ్చని వ్యాపార వర్గాలు అంటున్నాయి.0డా2

Latest Updates