ప్రొఫెషనల్స్ వద్ద పనిచేస్తున్న వారిపై సర్వే చేయనున్న కేంద్రం

లాయర్లు, డాక్టర్లు, ఆర్కిటెక్ట్‌‌లు, చార్టర్డ్‌‌‌‌‌‌‌‌ అకౌంటెంట్ల వద్ద పనిచేస్తున్నది ఎంత మంది?

ఉద్యోగుల‌‌‌‌పై పూర్తి లెక్కలు

ఉపాథి అవకాశాలపై సర్వే

న్యూఢిల్లీ: దేశంలోని ప్రొఫెషనల్స్‌‌‌‌ వద్ద ఎంత మంది ఉద్యోగాలు చేస్తున్నారనే లెక్కలు తీయాలనుకుంటోంది కేంద్ర ప్రభుత్వం. ముఖ్యంగా కోవిడ్‌‌‌‌–19 ఎకనమిక్‌‌‌‌ స్లోడౌన్‌‌‌‌ నేపథ్యంలో ఈ రంగంలో ఉపాథి అవకాశాలు ఎలా ఉన్నాయో పరిశీలించాలనుకుంటోంది.  ప్రభుత్వమూ, పరిశ్రమలూ మాత్రమే కాకుండా,  లాయర్లు, డాక్టర్లు, ఆర్కిటెక్ట్‌లు, చార్టర్డ్‌‌‌‌ అకౌంటెంట్లూ వంటి ప్రొఫెషనల్స్‌‌‌‌ కూడా దేశంలో చాలా మందికి జాబ్స్‌‌‌‌ కల్పిస్తున్నారు . దేశంలో ఉపాథి అవకాశాలు  ఎలా ఉన్నాయనేది తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఒక సర్వే చేయాలనుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రొఫెషనల్స్‌‌‌‌ కల్పించే జాబ్స్‌‌‌‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలనుకుంటోంది. ఈ సర్వే బాధ్యతను లేబర్‌‌‌‌ అండ్‌‌‌‌ ఎంప్లాయ్‌‌‌‌మెంట్‌‌‌‌ మినిస్ట్రీ కింద ఉన్న లేబర్‌‌‌‌ బ్యూరో, డేటా అండ్‌‌‌‌ స్టాటిస్టిక్స్‌‌‌‌ వింగ్‌‌‌‌కు అప్పచెబుతున్నారు. సర్వేతో దేశంలోని ఉద్యోగ అవకాశాల మీద సమగ్రమైన అవగాహన వస్తుందని సంబంధిత ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు.

ఇందుకోసం ఎకానమిస్ట్‌‌‌‌ ఎస్‌‌‌‌ పి ముఖర్జీ నాయకత్వంలో ఒక కమిటీని మినిస్ట్రీ ఏర్పాటు చేసింది. సర్వే ఏ విధంగా చేయాలనేది కమిటీ ఖరారు చేస్తుంది. దేశంలో ఉపాథి కల్పన చురుగ్గా సాగడం లేదు. గత ఆరు నెలలుగా కోవిడ్‌‌‌‌తో కష్టాలపాలైన ఎకానమీ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. దీంతో, ఉపాథి అవకాశాలు మెరుగుపరచడానికి జాబ్‌‌‌‌ మార్కెట్‌‌‌‌పై సరైన అవగాహన అవసరమని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కీలకమైన రంగాలలో జాబ్‌‌‌‌ మార్కెట్‌‌‌‌పై డేటా ఇందుకు సాయపడుతుందని ఆలోచిస్తోంది. సరైన డేటాతో పాలసీ రూపకల్పన ఈజీ అవుతుందనేది ప్రభుత్వ ఆలోచన. సరిగ్గా ఇక్కడే ప్రొఫెషనల్స్‌‌‌‌ దగ్గర పనిచేసే వారెంత మందో తెలుసుకోవడం ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వ అధికారులు అంటున్నారు.

ఉపాథి పెంచుతోన్న ప్రొఫెషనల్స్​..

దేశంలో రిజిస్టరయిన లాయర్లు 20 లక్షల మంది ఉండగా, 11.5 లక్షల మంది అలోపతిక్‌‌‌‌ డాక్టర్లు, 3 లక్షల మంది చార్టర్డ్‌‌‌‌ అకౌంటెంట్లు ఉన్నారు. చార్టర్డ్‌‌‌‌ అకౌంటెంట్లు ఉపాథి అవకాశాలను పెంచగలరని పరిశ్రమ నిపుణులు, ప్రొఫెషనల్స్‌‌‌‌ కూడా అంగీకరిస్తున్నారు. చార్టర్డ్‌‌‌‌ అకౌంటింగ్‌‌‌‌ రంగంలోని వారికే కాకుండా, సైబర్‌‌‌‌ సెక్యూరిటీ, డేటా ఎనలిటిక్స్‌‌‌‌ వంటి స్పెషలైజేషన్స్‌‌‌‌ ఉన్న వారికీ తాము ఉపాథి కల్పిస్తున్నట్లు ఇండియన్‌‌‌‌ చార్టర్డ్‌‌‌‌ అకౌంటెంట్స్‌‌‌‌ ఇన్‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌ (ఐసీఏఐ) మాజీ ప్రెసిడెంట్‌‌‌‌ కె రఘు చెప్పారు. సీఏ డిగ్రీ తీసుకుందామని ప్రయత్నించి, విఫలమైన కామర్స్‌‌‌‌ గ్రాడ్యుయేట్లు, పోస్ట్‌‌‌‌ గ్రాడ్యుయేట్లకు చాలా మందికి కూడా సీఏ ఫర్మ్స్‌‌‌‌ ఉద్యోగాలు ఇస్తున్నాయని పేర్కొన్నారు.

 

Latest Updates