కేంద్రం వడ్డీ వ్యాపారిలా వ్యవహిస్తోంది: కర్నె

కేంద్ర ప్రభుత్వం …తెలంగాణ రాష్ట్రానికే కాదు ఏ రాష్ట్రానికి ఏం చేయలేదని ఆరోపించారు ప్రభుత్వ విప్ కర్నెప్రభాకర్. 70 ఏళ్లలో ఎప్పుడు ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదు.. మోడీ ప్రధాని అయిన తర్వాతే ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నామని బీజేపీ చెప్పడం విచిత్రంగా ఉందన్నారు. గతంలో ఎన్డీయే అధికారంలో ఉందనే విషయం కిషన్ రెడ్డి మర్చిపోయారనుకుంటా అని అన్నారు. అటల్ బిహారీ వాజ్ పేయి ,మన్మోహన్ సింగ్ ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదా అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ ప్రతిపక్షాల మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు కర్నె.

సీఎం కేసీఆర్ సంధర్భం వచ్చినప్పుడల్లా కేంద్ర ప్రభుత్వాన్ని సమర్థించడంతో పాటు.. సోషల్ మీడియాలో ప్రధానిని తిడితే … వారికి గట్టి వార్నింగ్ ఇచ్చారని తెలిపారు కర్నె ప్రభాకర్. సంకుచిత స్వభావం మీదా…కేసీఆర్ దా అనేది మీరే ఆలోచించుకోవాలని సూచించారు. దేశమే కాదు ,ప్రపంచం మొత్తం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోంటదని …ఈ సంక్షోభం నుంచి బయటపడాలంటే హెలికాప్టర్ మనీ అవసరమని కేసీఆర్ ముందే చెప్పారన్నారు. కానీ ఇవేవీ కేంద్రం పట్టించుకోకుండా వడ్డీ వ్యాపారిలా ఉండడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు.

రాష్ట్రాలకు నగదు కేటాయిస్తే… రాష్ట్ర ప్రభుత్వాలు పరిస్థితులను బట్టి ఆ నగదు ను ఉపయోగించుకుంటాయన్నారు.ఏఫ్ ఆర్ బీం విషయంలో కేంద్ర నిర్ణయం వల్ల రాష్ట్రాలు నష్టపోతాయన్నారు. లాక్ డౌన్ పిరియడ్ లో పీపీయి కిట్లు, N 95 మాస్క్ తప్ప కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఏం లేదన్నారు. 20లక్షల కోట్లు ఎక్కడ  ఖర్చు పెడతారో ఆర్థిక నిపుణులకు కూడా అర్థం కావట్లేదన్నారు. 20 లక్షల ప్యాకేజీ చూస్తే మో చేతి కి బెల్లం పెట్టి నాకమన్నట్లు ఉందన్నారు. కేంద్రం వైఖరి ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెంక్కించేలా లేదని తెలిపారు.

విద్యుత్ రంగాన్ని తన గుత్తాధిపత్యంలోకి తెచ్చుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందని ఆరోపించారు కర్నె. అదే జరిగితే మాతో కలసి వచ్చే రాష్ట్రాలతో కలసి పోరాడుతామని తేల్చి చెప్పారు. రాష్ట్రాల అభిప్రాయం తీసుకున్న తర్వాతే విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకురావాలన్నారు. కేంద్రం సమాఖ్య స్పూర్తి కి న్యాయం చేయాలన్నారు. అన్నిట్లో 1 నేషన్ అంటున్న మోడీ..ఇప్పుడు ఓకే దేశం ఓకే గ్రిడ్ అంటున్నారు. ఇదే మేమంటుంన్నాం ఫ్యూడలిజమ్ అని. ఆకలి అవుతుంది అంటే ఆరు నెలలు ఆగు బిర్యానీ తినిపిస్తాం అన్నట్లు కేంద్రం ప్యాకేజీ ఉందన్నారు. ఆర్థిక సంక్షోభం నుండి గట్టెక్కడానికి ప్రపంచ దేశాలు అన్ని నేరుగా ప్రజల ఖాతాలో నగదు జమ చేస్తున్నారు. అలాగే మన దేశంలో కూడా జన్ థన్ ఖాతాలో నగదు జమచేయాలన్నారు కర్నె ప్రభాకర్ .

Latest Updates