సీరియస్​ కరోనా పేషెంట్లకు కేంద్రం కొత్త గైడ్​లైన్స్

న్యూఢిల్లీ: కరోనా వైరస్ నుంచి కోలుకున్నోళ్లకు మళ్లీ సింప్టమ్స్ వస్తున్నాయి. వైరస్ బారిన పడి సీరియస్ అయిన పేషెంట్లు, కోమార్బిడిటీస్ (ఇతర వ్యాధులు) ఉన్నోళ్లకు మళ్లీ తీవ్ర అలసట, బాడీ పెయిన్స్, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస ఇబ్బంది వంటి సింప్టమ్స్ కన్పిస్తున్నయి. ముఖ్యంగా హై ఫీవర్, ఛాతీనొప్పి, శ్వాసలో తీవ్ర ఇబ్బంది వంటివి మళ్లీ వచ్చినట్లయితే.. వెంటనే సమీపంలోని డాక్టర్లను సంప్రదించాలని కేంద్ర హెల్త్ మినిస్ట్రీ సూచించింది. సీరియస్, కోమార్బిడిటీస్ పేషెంట్లు కోలుకునేందుకు ఎక్కువ టైం పడుతోందని, వీరంతా చాలా జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. వీరు నిరంతరం తమ హెల్త్ ను, సింప్టమ్స్ ను చెక్ చేసుకుంటూ ఉండాలని చెప్పింది. కరోనా నుంచి కోలుకున్నవారు, హోం ఐసోలేషన్ లో ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై హెల్త్ మినిస్ట్రీ ఆదివారం ‘పోస్ట్ కొవిడ్ మేనేజ్ మెంట్ ప్రొటోకాల్’ కింద గైడ్ లైన్స్ జారీ చేసింది. సీరియస్, కోమార్బిడిటీస్ పేషెంట్లకు డాక్టర్ల పర్యవేక్షణ మరింత అవసరమంది. డాక్టర్ల సూచనల మేరకు ఇమ్యూనిటీ పెంచే మందులు వాడాలని, మంచి ఫుడ్ తీసుకోవాలని.. ఫిజికల్ ఎక్సర్ సైజులు, యోగా చేయాలని పేర్కొంది.

మీ అనుభవాలను చెప్పండి.. 

కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులు తమ పాజిటివ్ ఎక్స్ పీరియెన్సెస్ ను ఫ్రెండ్స్, చుట్టాలకు చెప్పాలని, సోషల్ మీడియా ద్వారా కూడా తమ అనుభవాలను చెప్పి.. ప్రజల్లో కరోనా పట్ల అవేర్ నెస్ పెంచాలని, అపోహలను తొలగించాలని కేంద్రం కోరింది. రిహాబిలిటేషన్ ప్రాసెస్ లో స్వచ్ఛంద సంస్థలు, నిపుణుల సపోర్ట్ ను తీసుకోవాలని సూచించింది. అవసరమైతే మెంటల్ హెల్త్ నిపుణుల సపోర్ట్ కూడా తీసుకోవాలని తెలిపింది.

రికవరీ పేషెంట్లకు కేంద్రం సూచనలు ఇవే..

సీరియస్, కోమార్బిడిటీస్ ఉన్న కరోనా పేషెంట్ల రికవరీకి ఎక్కువ టైం పడుతోంది. రికవరీ అయిన పేషెంట్లు కూడా మాస్కులు పెట్టుకోవాలి. ఇతరులకు దూరం పాటించాలి. తరచూ చేతులు కడుక్కోవాలి. పరిశుభ్రత పాటించాలి. తరచూ తగినన్ని వేడి నీళ్లు తాగాలి. ఆరోగ్యం సహకరిస్తే.. ఇంట్లో రోజువారీ పనులను చేసుకోవాలి. ప్రొఫెషనల్స్ దశలవారీగా తిరిగి పనిని ప్రారంభించవచ్చు. హెల్త్ బాగుంటే.. నిపుణుల సలహా తీసుకుని రోజూ యోగా, ప్రాణాయామం, మెడిటేషన్ చేసుకోవాతేలికగా అరిగిపోయే, మంచి పోషకాలు ఉండే ఫుడ్ తీసుకోవాలి. సరిపోయినంతగా నిద్ర పోవాలి. తగినంత రెస్ట్ తీసుకోవాలి.

స్మోకింగ్ చేయరాదు.

అల్లోపతి, ఆయుష్ మందులు ఏవి వేసుకున్నా.. అన్నింటి గురించీ డాక్టర్లకు చెప్పి, సలహాలు తీసుకోవాలి. ఇంటిదగ్గర స్వయంగా టెంపరేచర్, బీపీ చెక్ చేసుకోవాలి. డయాబెటిస్ ఉన్నోళ్లయితే బ్లడ్ షుగర్ లెవల్స్ ను చూసుకోవాలి. డాక్టర్లు సూచిస్తే.. పల్స్ ఆక్సిమెట్రీ ద్వారా బ్లడ్ ఆక్సిజన్ లెవల్స్ ను కూడా చెక్ చేసుకోవాలి.  తీవ్రమైన జ్వరం, శ్వాసలో ఇబ్బంది, ఛాతీ నొప్పి, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ 95% కంటే తక్కువ కావడం, కన్ఫ్యూజన్, నాడుల బలహీనత  సింప్టమ్స్ కనిపిస్తే వెంటనే డాక్టర్లను కలవాలి. ఇమ్యూనిటీ పెంచుకునేందుకు ఆయుష్ (ఆయుర్వేద, యునానీ, సిద్ధ, హోమియోపతి, నేచురోపతి వంటివి) మందులు వేసుకోవాలి. క్వాలిఫైడ్ డాక్టర్ల సూచనల మేరకే వీటిని వాడాలి. డాక్టర్ల సూచన ప్రకారం ఫిజికల్, బ్రీతింగ్ ఎక్సర్ సైజులు చేయాలి. రోజూ ఉదయం లేదా సాయంత్రం మరీ ఇబ్బంది పడనంత మేరకు వాకింగ్ చేయాలి. కరోనా మందులు రెగ్యులర్ గా వేసుకోవాలి. కోమార్బిడిటీస్ (ఇతర వ్యాధులు) ఉంటే ఆ మందులూ వాడాలి. అల్లోపతి, ఆయుష్ మందులు ఏవి వేసుకున్నా.. అన్నింటి గురించీ డాక్టర్లకు చెప్పి, సలహాలు తీసుకోవాలి

ఇంటిదగ్గర స్వయంగా టెంపరేచర్, బీపీ చెక్ చేసుకోవాలి. డయాబెటిస్ ఉన్నోళ్లయితే బ్లడ్ షుగర్ లెవల్స్ ను చూసుకోవాలి. డాక్టర్లు సూచిస్తే.. పల్స్ ఆక్సిమెట్రీ ద్వారా బ్లడ్ ఆక్సిజన్ లెవల్స్ ను కూడా చెక్ చేసుకోవాలి.  తీవ్రమైన జ్వరం, శ్వాసలో ఇబ్బంది, ఛాతీ నొప్పి, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ 95% కంటే తక్కువ కావడం, కన్ఫ్యూజన్, నాడుల బలహీనత  సింప్టమ్స్ కనిపిస్తే వెంటనే డాక్టర్లను కలవాలి. ఇమ్యూనిటీ పెంచుకునేందుకు ఆయుష్ (ఆయుర్వేద, యునానీ, సిద్ధ, హోమియోపతి, నేచురోపతి వంటివి) మందులు వేసుకోవాలి. క్వాలిఫైడ్ డాక్టర్ల సూచనల మేరకే వీటిని వాడాలి. డాక్టర్ల సూచన ప్రకారం ఫిజికల్, బ్రీతింగ్ ఎక్సర్ సైజులు చేయాలి. రోజూ ఉదయం లేదా సాయంత్రం మరీ ఇబ్బంది పడనంత మేరకు వాకింగ్ చేయాలి. కరోనా మందులు రెగ్యులర్ గా వేసుకోవాలి. కోమార్బిడిటీస్ (ఇతర వ్యాధులు) ఉంటే ఆ మందులూ వాడాలి. పొడి దగ్గు, గొంతు నొప్పి కంటిన్యూగా ఉంటే.. మూలికలు, స్పైసెస్ వంటి వాటితో తయారు చేసిన లిక్విడ్ తో నోటిని పుక్కిలించాలి. ఆవిరి పట్టుకోవాలి. దగ్గు ఎక్కువగా ఉంటే డాక్టర్లు సూచించిన మందులనే వాడాలి.

Latest Updates