సమ్మెపై కేంద్రం జోక్యం చేసుకోవాలి : ఎంఏ ఖాన్​

న్యూఢిల్లీ, వెలుగు: ఆర్టీసీ సమ్మె అంశం పార్లమెంట్​ను తాకింది. బుధవారం రాజ్యసభలో జీరో అవర్ లో  కాంగ్రెస్ ఎంపీ ఎంఏ ఖాన్  ఈ అంశాన్ని లేవనెత్తారు. కార్మికులపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలతో వేలాది మంది కార్మికులు రోడ్డునపడ్డారని, చాలా మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారని, ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని సభ దృష్టికి తెచ్చారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని, కార్మికులను ఆదుకోవాలని ఆయన డిమాండ్​ చేశారు.

మరిన్ని వార్తల కోసం

 

Latest Updates