సెంట్రల్ విస్టా ను కొనసాగించవచ్చు

  • ఆపాల్సిన అవసరం లేదని చెప్పిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ ను కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ ప్రాజెక్ట్ కోసం భూ వినియోగ చట్టంలో మార్పు చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ చేపట్టిన కోర్టు ప్రాజెక్ట్ ను ఆపాల్సిన అవసరం లేదని తెలిపింది. దీంతో ఈ ప్రాజెక్ట్ కు లైన్ క్లియర్ అయ్యింది. సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ లో భాగంగా కొత్త పార్లమెంట్ భవనంతో పాటు ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ లకు కొత్త నివాస భవనాలు కట్టనున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కు కావాల్సిన భూ వినియోగ మార్పునకు కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రస్తుతమున్న పార్లమెంట్ భవనం, రాష్ట్రపతి భవన్, నార్త్, సౌత్ బ్లాక్ భవనాలన్నీ 1931 లో నిర్మించినవే. పార్లమెంట్ కొత్త బిల్డింగ్ నిర్మించాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. దీంతో 2 వేల కోట్ల రూపాయల కేంద్రం ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించింది. ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ తో ప్రభుత్వానికి ఆదాయం తగ్గటంతో ఈ ప్రాజెక్ట్ ను నిలిపివేయాలని ఇటీవల ప్రధాని రాసిన లేఖలో సోనియా కోరారు. ప్రాజెక్ట్ పెట్టే ఖర్చును హాస్పిటల్స్ సౌకర్యాలు కల్పించేందుకు వినియోగించాలని సూచించారు.

Latest Updates