కరోనాపై సకాలంలో స్పందించని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు: భట్టి

కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు సరైన సమయంలో స్పందించలేదని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క. సకాలంలో స్పందించి ఉంటే కరోనాతో ప్రజలు ఇబ్బంది పడాల్సి వచ్చేది కాదన్నారు. వలస కార్మికులు, చిరు వ్యాపారుల గురించి ఆలోచించకుండా లాకడౌన్‌ విధించారని విమర్శించారు. లాకడౌన్‌ విధించిన తర్వాత 20 లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజీని ప్రకటించారని… వలస కార్మికుల గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సూచనలతో ప్రజలు సెల్ఫ్ క్వారంటైన్ పాటిస్తే కేసీఆర్‌ వైన్‌ షాప్‌లు తెరిచి నాశనం చేసారన్నారు. సీఎంకు ఆదాయం మీద ఉన్నంత ఆరాటం…ప్రజా పాలనపై లేదని విమర్శించారు భట్టి. ప్రభుత్వం చెప్పిన పంట వెయ్యకపోతే రైతు బంధు ఇవ్వబోమని ప్రభుత్వం బెదిరింపులకు దిగుతోందని ఆరోపించారు. ఎకరాకు కోటి ఆదాయం వస్తుందని చెపుతున్న సీఎం కేసీఆర్ … రైతులకు ఆ రహస్యం చెప్పితే బాగుంటుందన్నారు భట్టి.

Latest Updates