పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం

కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి గుడ్ న్యూస్ చెప్పింది. రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 2021-22 రబీ సీజన్ కు కనీస మద్దతు ధరను పెంచాలని నిర్ణయించింది. కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని అధికారులు తెలిపారు.

మద్దతు ధర పెరగనున్న పంటల లిస్టులో బార్లీ, గోధుమ, ఆవాలు, కుసుమ తదితరాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులు తీవ్రంగా నష్టపోతారని విపక్షాలు ఆరోపిస్తున్న సమయంలో…కనీస మద్దతు ధరను పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.

Latest Updates