ఎన్నారైల వివాహ బిల్లుకు కేబినెట్ ఆమోదం

న్యూఢిల్లీ: ఎన్నారైల పెళ్లి రిజిస్ట్రేషన్ బిల్లు 2019కి ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎన్నారై పెళ్లిళ్లలో బాధ్యత పెంచేలా, ఇండియన్లను ప్రత్యేకించి మహిళలకు ఈ బిల్లు ద్వారా రక్షణ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించి ఈ బిల్లును ప్రవేశపెట్టింది. సోమవారం ఈ
బిల్లు రాజ్యసభ ముందుకు వచ్చినా పాస్ కాలేదు. ఈ బిల్లు పాసైతే ఎన్నారైలు తమ పెళ్లిని ఇండియాలో లేదంటే విదేశాల్లోని ఇండియన్ మిషన్స్ అండ్ పోస్స్ట్ లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగా పాస్ పోర్స్ట్ చట్టం 1967, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973లో సెక్షన్ 86ఏని చేర్చుతూ మార్పులు చేయాల్సి ఉంటుంది. దీని వల్ల ఎన్నారైలు తమ భార్య లేదా భర్తపై వేధింపులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. ఎన్నారైలను పెళ్లి చేసుకున్న భారత మహిళలకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

తమిళనాడులోని కూనూర్ లో వ్యాక్సి న్ ప్లాంటు కోసం పాశ్చర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (పీఐఐ)కి ఉచితంగా భూమిని ఇచ్చేం దుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్లాం ట్ లో టీసీఏ మీజిల్స్ వ్యాక్సిన్ , జపనీస్ ఎన్ సెఫలైటిస్ (మెదడువాపు), యాంటీ సెరా వ్యాక్సి న్లను సంస్థ ఉత్పత్తి చేయనుంది.

Latest Updates