కేంద్ర విద్యుత్‌ చట్టం చాలా ప్రమాదం: కేసీఆర్

కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్‌ చట్టం చాలా ప్రమాదమన్నారు సీఎం కేసీఆర్. అసెంబ్లీలో విద్యుత్‌ సమస్యలపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. ఈ బిల్లును పార్ల‌మెంట్‌లో పూర్తి స్థాయిలో వ్య‌తిరేకిస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. దేశంలో 70 వేల టీఎంసీల నీరు ఉందిని…కానీ చెన్నైలో తాగునీటికి అనేక స‌మ‌స్య‌లు ఉన్నాయన్నారు. దేశంలో 75 శాతం మంది మంచి నీటి కోసం అల్లాడుతున్నారని తెలిపారు.  ప్ర‌జ‌ల ప్రాథ‌మిక అవ‌స‌రాలు తీర్చాల‌నే ఆలోచన బీజేపీ ,కాంగ్రెస్ పార్టీల‌కు లేకుండా పోయిందని ఆరోపించారు. దేశంలో 40 కోట్ల ఎక‌రాల భూమి సాగులో ఉందన్నారు. పుష్క‌లంగా స‌రిపోయే నీరు ఉన్నా.. సాగుకు ఇవ్వ‌లేదని తెలిపారు. దేశంలో స్థాపిత విద్యుత్ శ‌క్తి 4 ల‌క్ష‌ల మెగావాట్ల పైనే ఉందని చెప్పారు. ఇప్ప‌టి వ‌ర‌కు 2 ల‌క్ష‌ల 16 వేల మెగావాట్లు మాత్ర‌మే దేశంలో ఉపయోగించారన్నారు. దేశ ప్ర‌గ‌తి కోసం మిగులు విద్యుత్‌ను వినియోగంలోకి తేవాల‌నే ఆలోచ‌న లేదని… కేంద్ర విద్యుత్ చ‌ట్టాన్నితాము పార్ల‌మెంట్‌లో వ్య‌తిరేకిస్తామ‌న్నారు సీఎం కేసీఆర్.

Latest Updates