అవాస్త‌వం: సిటీలో దిగిన పారామిలటరీ సైన్యం

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా తెలంగాణకు కేంద్ర బలగాలు వస్తున్నాయన్న వార్తలను తెలంగాణ డీజీపీ కార్యాలయం కొట్టిపరేసింది. ఆ వార్తలు అవాస్తవమని తెలిపింది. తెలంగాణకు కేంద్ర బలగాలు కావాలని కోరలేదని, ఆ అవసరం కూడా లేదని స్పష్టం చేసినట్లు పేర్కొంది.

లాక్ డౌన్ విధించిన‌ప్ప‌టికీ కొంద‌రు రోడ్ల‌పైకి రావ‌డంతో రాష్ట్రానికి కేంద్ర బ‌ల‌గాలు వ‌చ్చిన‌ట్లు వార్త‌లొచ్చాయి. వీడియోలు కూడా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. క‌రోనా క‌ట్ట‌డి కోసం తీసుకుంటున్న చ‌ర్య‌ల్లో భాగంగా తెలంగాణ‌లో కేంద్ర బ‌ల‌గాల‌ను దింపుతున్నార‌నే వార్త వైర‌లవ‌డం తెలిసిందే. దీనిపై స్పందించిన డీజీపీ ఆఫీసు ఈ వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. రాష్ట్రానికి కేంద్ర బలగాలు కావాలని కోరలేదు, అవసరం కూడా లేదు అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది డీజీపీ ఆఫీసు.

Latest Updates