ఆకాశ్ మిస్సైల్ కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

సరిహద్దు భద్రత, రక్షణ రంగ బలోపేతానికి కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 5 వేల కోట్ల రూపాయలతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం ఆకాశ్ మిస్సైల్ కొనుగోలుకు క్లియరెన్స్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. బాలాకోట్ లో దాడుల తర్వాత మిస్సైల్స్ ను పెంచేందుకు.. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

గతేడాది సూర్యలంకలో జరిగిన క్రాస్ బౌలో ఆకాశ్ మిస్సైల్ ను తొలిసారిగా పరీక్షించింది ఎయిర్ ఫోర్స్. మిగిలిన వాటితో పోలిస్తే ఆకాశ్ మంచి పర్ఫార్మెన్స్ చూపటంతో.. కేంద్రం ఆకాశ్ మిస్సైల్స్ ను కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఇక ఈ ప్రాజెక్ట్ తో  ఆకాశ్ మిస్సైల్స్ ఆర్డర్స్ సంఖ్య 15కు చేరనుంది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసే ఆకాశ్ క్షిపణులను పాక్, చైనా బోర్డర్ లో వినియోగించనున్నారు. ఆకాశ్ మిస్సైల్స్ తో పాటు 83 తేలికపాటి యుద్ధ విమానాలను కూడా కొనుగోలు చేయనుంది కేంద్రం.

Latest Updates