ఇగ కొత్త చదువులు

నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-–2020ని తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం
స్కూల్, హయ్యర్ ఎడ్యుకేషన్లో కీలక సంస్కరణలు
హెచ్చార్డీ మినిస్ట్రీ ఇక విద్యాశాఖ
3 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వరకు నిర్బంధ విద్య
10+2కు బదులు 5+3+3+4 విధానం
ఎంఫిల్ కోర్సుల నిలిపివేత..
స్థానిక భాషల్లో ఈ-కోర్సులు

న్యూఢిల్లీ: సదువును సక్కగ చేసేందుకు కేంద్రం చర్యలు షురూ చేసింది. బుక్కుల బరువు కాదు.. ఆదరువు చూపే ఎడ్యుకేషన్ కావాలని కీలక నిర్ణయాలు తీసుకుంది. 34 ఏళ్లలో తొలిసారిగా దేశవిద్యా విధానంలో భారీ మార్పులు చేసేందుకు ముందడుగు వేసింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020కి కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. స్కూల్ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్ లో ఎన్నో సంస్కరణలు చేసింది. హ్యూమన్ రీసోర్స్ డెవలప్ మెంట్ మినిస్ట్రీ పేరును.. విద్యా శాఖగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేవకర్ మీడియాకు వివరించారు.

ఎన్నో ఏళ్లుగా మార్పులు చేయలే
‘‘21వ శతాబ్దం కోసం రూపొందించిన ఎడ్యుకేషన్ పాలసీని ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేబినెట్ ఆమోదించింది. ఇప్పుడు ఇది చాలా ముఖ్యం. గత 34 ఏళ్లలో ఎడ్యుకేషన్ పాలసీలో ఎలాంటి మార్పులు చేయలేదు’’ అని ప్రకాశ్ జవదేవకర్ చెప్పారు. 2030 నాటికి అందరికీ విద్య అందించాలని, స్టూడెంట్లపై క్యరికులమ్ భారం తగ్గించడమే కొత్త విద్యావిధానం లక్ష్యమని స్పష్టం చేశారు.

మరిన్నిఇంపార్టెంట్ రీఫార్మ్స్
లీగల్, మెడికల్ కాలేజీలు మినహా మిగతా అన్ని హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లన్నీ ఒకే రెగ్యులేటరీ పరిధిలోకి రానున్నాయి.
ప్రైవేట్, ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థలకు కామన్ రూల్స్ అమలులోకి వస్తాయి.
స్థానిక భాషల్లోకూడా ఈ-కోర్సులు.
ల్యాబ్స్ లేని సంస్థల్లో వర్చువల్ ల్యాబ్స్ ఫెసిలీటీ ఏర్పాటు.
నేషనల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఫోరమ్ (ఎన్ఈటీఎఫ్) స్థాపన.
నాలెడ్జ్ అప్లికేషన్ ఆధారంగా బోర్డు పరీక్షలు.
ఐదో తరగతి దాకా మదర్ టంగ్ లేదా లోకల్ లేదా రీజనల్ భాషలో బోధన ఉండాలి. అవసరమైతే ఎనిమిదో తరగతి వరకు కూడా.
రిపోర్ట్ కార్డులు కేవలం మార్కులు, స్టేట్‌మెంట్లకు పరిమితం కావద్దు. స్టూడెంట్ల స్కిల్స్, కేపబులిటీస్ పై సమగ్ర నివేదికగా ఉండాలి.
విద్యా హక్కు చట్టం కింద వయసు పరిమితి పెంపు.

34 ఏళ్ల తర్వాత..
ఇస్రో మాజీ చీఫ్ కె. కస్తూరిరంగన్ ఆధ్వర్యంలోని కమిటీ కొత్త ఎడ్యుకేషన్ పాలసీని రూపొందించింది. దీన్నిపబ్లిక్ డొమైన్ లో పెట్టగా.. దాదాపు 2 లక్షలకుపైగా సలహాలు, సూచనలు వచ్చాయి. 2.5 లక్షల గ్రామ పంచాయతీలు, 6,600 బ్లాక్‌లు, 676 జిల్లాలను సంప్రదించినట్లు జవదేవకర్ వెల్లడించారు. కాగా, ప్రస్తుతం అమలులో ఉన్న ఎడ్యుకేషన్ పాలసీని 1986 రూపొందించారు. 1992లో రివైజ్ చేశారు. దాదాపు 34 ఏళ్ల తర్వాత విద్యా విధానంలో మార్పులు జరిగాయి. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు బీజేపీ ఆధ్వర్యంలోని సర్కారు కొత్త పాలసీ తెచ్చింది.

విద్యను నాశనం చేసే చర్య: సీపీఎం
కొత్త ఎడ్యుకేషన్ పాలసీని సీపీఎం వ్యతిరేకించింది. ఇండియన్ ఎడ్యుకేషన్ ను నాశనం చేసేందుకు తీసుకున్న ఏకపక్ష చర్య అని ఆ పార్టీ మండిపడింది. కొత్త ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చే విషయంలో కనీసం పార్లమెంటును పట్టించుకోలేదని ఆరోపించింది. కొత్త విధానంపై పార్లమెంటులో చర్చిస్తామని కేంద్రం గతంలో చెప్పిందని, కానీ అలా చేయలేదని ఓ ప్రకటనలో చెప్పింది.

నాలుగు దశల్లో..
దేశవ్యాప్తంగా చదువును అందరికీ అందుబాటులోకి తెచ్చేలా కొత్త జాతీయ విద్యా విధానాన్ని కేంద్రం తీసుకొచ్చింది. కొత్త సిస్టమ్ నాలుగు దశల్లో ఉండనుంది. 5+3+3+4 విధానంలో విద్యా విధానం అమలులోకి రానుంది. 3 నుంచి 18 ఏళ్ల వయసున్న వారికి నిర్బంధ విద్యను అందిస్తారు. నాలుగు దశల్లో మొదటి ఐదేళ్లను ఫౌండేషన్ స్టేజ్ (3 నుంచి 8 ఏళ్లు) గా పరిగణిస్తారు. తర్వాత మూడేళ్లను ప్రీ ప్రైమరీ స్కూల్ (8 నుంచి 11 ఏళ్లు), ప్రిపరేటరీ స్టేజ్ (11 నుంచి 14 ఏళ్లు) సెకండరీ స్టేజ్ (14 నుంచి 18 ఏళ్లు)

10+2కు బదులు 5+3+3+4 విధానం
ఎర్లీచైల్డ్ హుడ్ కేర్ ఎడ్యుకేషన్ (ఈసీసీఈ)యూనివర్సలైజేషన్
ఫండమెంటల్ లిటరసీ,న్యుమరసీపై నేషనల్ మిషన్ ఏర్పాటు
దేశంలోమూడేళ్ల నుంచి18 ఏళ్ల వరకు ప్రతి ఒక్కరికి విద్య తప్పనిసరి.
21వ సెంచరీకి అనుగుణంగా మ్యాథమెటికల్ థింకింగ్, సైంటిఫిక్ టెంపర్తో కూడిన కరికులమ్.
ఆర్ట్స్, సైన్స్ మధ్య.. కరికులర్, ఎక్స్ ట్రా కరికులర్ యాక్టివిటీస్ కు మధ్య.. ఒకేషనల్,అకడమిక్స్ర్ కు మధ్య ఎలాంటి సపరేషన్ ఉండదు.
12వ తరగతి వరకు కేజీబీవీల అప్ గ్రేడ్.
సిలబస్ తగ్గింపు
హయ్యర్ ఎడ్యుకేషన్ లో ప్రధాన సంస్కరణలు
2035నాటికి 50శాతం గ్రాస్ ఎన్ రోల్ మెంట్ రేషియో సాధించడమే లక్ష్యం. ప్రస్తుతం అది 26.3 శాతంగా ఉంది. దీని వల్ల కొత్తగా3.5 కోట్ల కొత్త సీట్లు అందుబాటులోకి వస్తాయి.
మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకురానున్నారు. సబ్జెక్టుల విషయంలో ఫ్లెక్సి బులిటీ ఉంటుంది. మల్టిపుల్ ఎంట్రీ, ఎగ్జిట్ కు అవకాశం.
స్టూడెంట్ ఒక కోర్సు మధ్యలో మరో కోర్సు తీసుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఇందుకోసం ఆ స్టూడెంట్ మొదటి కోర్సు నుంచి కొన్నాళ్లు విరామం తీసుకోవచ్చు.
యూజీ ప్రోగ్రామ్ మూడు లేదా నాలుగేళ్లు. పీజీ ఒకటి లేదా రెండేళ్లు. ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ.
ఎంఫిల్ కోర్సుల నిలిపివేత
క్రెడిట్ ట్రాన్స్ ఫర్, అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్
రీసెర్చ్ ఇంటెన్సివ్/టీచింగ్ ఇంటెన్సివ్ యూనివర్సిటీలు. అటానమస్ గా డిగ్రీ గ్రాంటింగ్ కాలేజీలు.
ప్రతి జిల్లాలో మోడల్ మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్, రీసెర్చ్ యూనివర్సిటీ (ఎంఈఆర్యూ)లఏర్పాటు.

For More News..

మన నేలపై కన్నేసిన వారికి ఇదో హెచ్చరిక

Latest Updates