కరోనా అలర్ట్..విమాన సర్వీసులు బంద్

రోజు రోజుకు విస్తరిస్తున్న కరోనా వైరస్ ను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు సూచనలు పాటించాలని కోరింది. కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ.. 65 ఏళ్లు దాటిన వృద్ధులు, పదేళ్ల లోపు పిల్లలు ఇంటి నుంచి బయటకు రావొద్దని ఆదేశించారు. ఈ నెల 22 నుంచి వారం 29 వరకు కేంద్రం అంతర్జాతీయ,వాణిజ్య విమాన సర్వీసుల అనుమతి రద్దు చేస్తున్నట్లు చెప్పారు.

కేంద్ర ప్రభుత్వ గ్రూప్ బీ,సీ కేటగిరీ ఉద్యోగులు వారం విడిచి వారం పనిచేయాలని ఆదేశించారు. మిగిలిన ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాలని ఆదేశించారు. ప్రత్యేక రైళ్లు కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దివ్యాంగులు,రోగులు తప్ప అన్ని రాయితీ పాస్ లు రద్దు చేస్తున్నామన్నారు.

ప్రజాప్రతినిధులు, డాక్టర్లు,  ప్రభుత్వ ఉద్యోగులకు మినహాయింపునిచ్చింది. పౌరవిమానాయాన పాస్ లు రద్దు చేస్తున్నామన్నారు. అత్యవసర సర్వీసుల్లో పనిచేసే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు తప్ప మిగతా వారంతా ఇంటి నుంచే పనిచేసేలా చూడాలని కేంద్రం ఆదేశించిందన్నారు.

Latest Updates