బాగా ఉడికించిన మాంసం, గుడ్లతో ఎటువంటి ఇబ్బంది లేదు

పౌల్ట్రీ అమ్మకాలపై ఉన్న నిషేధం విషయంలో పునరాలోచించాలని రాష్ట్రాలకు సూచించింది కేంద్రం. అన్ని జాగ్రత్తలతో అమ్మకాలకు అనుమతి ఇవ్వాలని కోరింది. బాగా ఉడికించిన మాంసం, గుడ్లతో ఎటువంటి ఇబ్బంది లేదని స్పష్టం చేసింది. కరోనా కారణంగా ఇప్పటికే నష్టపోయిన పౌల్ట్రీ రంగం, మొక్కజొన్న రైతులు…అనవసరమైన అపోహలతో మరింత నష్టపోతారని హెచ్చరించింది. ప్రజల్లో తగిన అవగాహన పెంపొందించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. మహారాష్ట్రలోని 9 జిల్లాల్లో పౌల్ట్రీ కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకిందని కేంద్రం ప్రకటించింది.

Latest Updates