పార్లమెంట్‌ సమావేశాలు కుదించనున్న కేంద్రం

పార్లమెంట్ సమావేశాలను కుదించే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా బారిన పడుతున్న ఎంపీల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుండటంతో కేంద్రం ఈ దిశగా యోచిస్తోంది. ఇప్పటికే దాదాపు 30 మంది ఎంపీలు కరోనా బారిన పడ్డారు. షెడ్యూల్ ప్రకారం ప్రస్తుత సమావేశాలు ఈ నెల 14 నుంచి అక్టోబర్ 1 వరకు జరగనున్నాయి. పార్లమెంటు ఏరియా దగ్గర అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్రం పునరాలోచనలో పడింది. సమావేశాల రోజులను కుదించే యోచనలో కేంద్రం ఉందని పార్లమెంట్ అధికారులు చెపుతున్నారు.

Latest Updates