భారీ ఆఫర్లు..అమెజాన్, ప్లిప్ కార్ట్ లకు కేంద్రం నోటీసులు

పండగ పూట కస్టమర్లను ఆకట్టుకునేందుకు భారీ ఆఫర్లు ప్రకటించిన  ఈ కామర్స్ దిగ్గజాలు ప్లిప్ కార్ట్, అమెజాన్ లకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. ఈ కామర్స్ లో అమ్మే ప్రతీ వస్తువు ఏ దేశంలో..ఎక్కడ తయారయ్యింది లాంటి ఇతర  వివరాలన్నీ తెలపాలని ఆదేశించింది. దీనిపై  మరో 15 రోజుల్లో పూర్తి వివరాలను తెలియజేయాలని ప్లిప్ కార్ట్, అమెజాన్ లను ఆదేశించింది. లేకపోతే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అంతేగాకుండా ఈ నిబంధనలను ఇకపై అన్ని ఈ- కామర్స్ సంస్థలు ఖచ్చితంగా పాటించాలని సూచించింది.  వస్తువుకు సంబంధించిన ప్రతీ డీటెయిల్స్ వినియోగదారుడికి తెలియజేయాల్సి ఉంటుంది.

దసరా ,దీపావళి ఫెస్టివల్స్ పేరిట అమెజాన్,ప్లిప్ కార్ట్ లు బిగి బిలియన్ డేస్, గ్రేట్ ఇండియన్ సేల్స్ అంటూ అక్టోబర్ 16 నుంచి 21 వరకు భారీ ఆఫర్లను ప్రకటించింది. స్మార్ట్ ఫోన్ నుండి ఎలక్ట్రానిక్స్  వస్తువుల వరకు డిస్కౌంట్లను ఇస్తుంది.

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం..7 మంది మృతి

Latest Updates