బర్డ్ ఫ్లూ విజృంభణ.. రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు

ఉత్తరాది రాష్ట్రాలను వణికిస్తున్న బర్డ్ ఫ్లూతో కేంద్రం అప్రమత్తమయ్యింది. బర్డ్ ఫ్లూ విస్తరించకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రపాలిత ప్రాంతాలకు ,అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. బర్డ్ ఫ్లూ వ్యాప్తిని నివారించకుండా రాష్ట్రప్రభుత్వాలు,కేంద్ర పాలిత ప్రాంతాలు కార్యాచరణను రూపొందించుకోవాలని ఆదేశించింది.

రాజస్థానర్, కేరళ, మధ్యప్రదేశ్,హిమాచల్ ప్రదేశ్ , హర్యానా,గుజరాత్ లో భారీగా పక్షులు చనిపోయాయి.  జైపూర్ లో అనారోగ్యానికి గురైన కాకి నుంచి అటవిశాఖ అధికారులు శాంపిల్స్ పరీక్షించగా  బర్డ్ ఫ్లూ సోకినట్లు నిర్ధారించారు.  ఈ వైరస్ సోకిన పక్షుల్లో వణుకు,పక్షపాతం,తలవంపు,వీరేచనాలు కనిపిస్తాయని తెలిపారు. వలస పక్షులకు బర్డ్ ఫ్లూ సోకకుండా రాష్ట్రాల స్థాయిలో పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ వైరస్ పౌల్ట్రీ రంగానికి సోకకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించింది. వలస పక్షలు మృతి చెందితే తమకు నివేదిక ఇవ్వాలని సూచించింది.

బర్డ్ ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో జూ పార్క్ లలో నిఘా పెంచాలని తెలపింది. జంతువులను, పక్షులను ముట్టుకునేటప్పుడు ఫేస్ మాస్కులు, కవచాలు ధరించాలని సూచించింది.పెంపుడు జంతువులను పట్టుకునేటప్పుడు కళ్లజోడు పెట్టుకోవాలని,జంతువులను పట్టుకుని తినడం, నీళ్లు తాగడం చేయకూడదని సూచించింది.

Latest Updates