ఈ ఇద్దరు ఏసీపీలు క్రైం బ్రాంచ్‌లో బెస్ట్ పెర్ఫామర్స్

ఏసీపీలు నరసింహారావు, మోహన్​కుమార్‌‌కు కేంద్ర హోంశాఖ అవార్డులు

న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రానికి చెందిన ఇద్దరు పోలీసు అధికారులకు ప్రతిష్టాత్మకమైన కేంద్ర హోం శాఖ అవార్డులు దక్కాయి. రాష్ట్ర పోలీసు శాఖలో పనిచేస్తున్న అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఏవీఆర్ నరసింహారావు, ఏసీపీ ఎన్.మోహన్ కుమార్​ను ‘మెడల్ ఫర్ ఎక్స్ లెన్సీ ఇన్ పోలీస్ ఇన్విస్టిగేషన్’ అవార్డులు వరించినట్లు కేంద్ర హోంశాఖ మంగళవారం ప్రకటించింది.  క్రైమ్​ ఇన్వెస్టిగేషన్​లో బెస్ట్​ పర్​ఫార్మెన్స్​ కనబర్చిన  పోలీసులకు ఏటా ఈ అవార్డులు అందజేస్తుంటారు. 2018 ఏడాదికి గాను దేశవ్యాప్తంగా 96 మందికి   అవార్డులు దక్కాయి. మోహన్ కుమార్ ప్రస్తుతం సౌత్ జోన్  స్పెషల్ బ్రాంచ్ ఏసీపీగా విధులు నిర్వహిస్తున్నారు.

Latest Updates