కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి శుక్ర‌వారం ప్రారంభమైంది.మంత్రి కేటీఆర్ శుక్రవారం సాయంత్రం దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్‌ బ్రిడ్జిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, మంత్రులు తలసాని, శ్రీనివాస్ గౌడ్, అధికారులు పాల్గొన్నారు.

జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45ను కలుపుతూ ఫ్లై ఓవర్‌ను నిర్మించారు. ఫ్లై ఓవర్‌కు పెద్దమ్మతల్లి ఎక్స్‌‌ప్రెస్ వేగా ప్రభుత్వం నామకరణం చేసింది. ఆసియాలోనే రెండవ అతిపెద్ద కేబుల్ బ్రిడ్జి నిర్మాణంగా ఈ వంతెన రూపుదిద్దుకుంది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ వైపు నుంచి సిగ్నల్‌ చిక్కులు లేని ప్రయాణం కోసం దుర్గం చెరువు, రోడ్‌ నెంబర్‌ -45లో వంతెన నిర్మించారు. రూ.184 కోట్లతో దుర్గం చెరువుపై, రూ.150 కోట్లతో రోడ్‌ నెంబర్‌-45లో వంతెనల పనులు పూర్తిచేశారు. రోడ్‌ నెంబర్‌-45 నుంచి ఐటీ కారిడార్‌కు సులువైన ప్రయాణానికి అవకాశం కలగనుంది.

central minister kishan reddy and Minister KTR inaugurated the Durgam Cheruvu Cable Bridge

Latest Updates