ఆరేళ్లుగా అవినీతిలేని పాలన అందిస్తున్నాం

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరేళ్ల నుంచి అవినీతిలేని పాలనను అందిస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మోడీ నేతృత్వంలో రెండోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా సమయంలో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకొని.. కరోనా పోరాటంలో దేశాన్ని ముందడుగు వేయించామని ఆయన అన్నారు.

‘పాకిస్తాన్ మనదేశంపై చాలా కుట్రలు చేసింది. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రధాని మోడీ తిప్పికొట్టారు. ఎన్ఢీఏ 2.0లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం. దేశంలో మానవ అక్రమ రవాణా జరుగుతోంది. అక్రమ రవాణాకు సంబంధించి NIAకు పూర్తి అధికారాలు ఇచ్చాం. ఆయుధాల లైసెన్స్ క్రమబద్ధీకరించాం. ఒక వ్యక్తి దగ్గర రెండు కంటే ఎక్కువ ఆయుధాలు ఉండకూడదని నిర్ణయించాం. ట్రిపుల్ తలాఖ్ వంటి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం. ముస్లిం మహిళలకు ఓ సోదరుడిగా వారి గుండెల్లో మోడీ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. జమ్ము-కాశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్నాం. జమ్ము-కాశ్మీర్ విలీనం సంపూర్ణమయ్యేలా చేశాం. భారత పౌరులందరికీ అందే అన్ని ప్రయోజనాలు అక్కడి ప్రజలకు కూడా అందేలా చేశాం. లద్దాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని అక్కడి ప్రజల చిరకాల వాంఛ. దాన్ని కూడా నెరవేర్చాం. దేశవ్యాప్తంగా ఉగ్రవాద చర్యలు లేకుండా అడ్డుకట్ట వేశాం. పౌరసత్వ సవరణ చట్టమనే మరో సాహసోపేత నిర్ణయం తీసుకున్నాం. మన్మోహన్ సింగ్ సహా కమ్యూనిస్ట్ నేతలందరూ ఈ చట్టం తీసుకురావాలని కోరారు. కానీ ఎవరూ చట్టాన్ని మాత్రం రూపొందించలేకపోయారు. పాకిస్తాన్‌లో మతపరమైన హింసకు గురై.. ధన, మాన, ప్రాణాల దోపిడీకి గురై.. మన దేశానికి వచ్చిన పీడిత వర్గాలకు పౌరసత్వం కల్పించాం. అంతర్జాతీయ ఇంటర్‌పోల్ తరహాలో ఎన్ఐఏను తీర్చిదిద్దాం’ అని హోం సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

For More News..

‘కబీర్ సింగ్’ సినిమా చూసి.. డాక్టర్‌గా అవతారమెత్తి..

వీడియో: కరోనా కట్టడికి నాలుగేళ్ల చిన్నారి జాగ్రత్తలు

విద్యార్థులకు శుభవార్త.. ఎగ్జామ్స్ లేకుండానే  ప్రమోట్

Latest Updates