మహంకాళీ అమ్మవారిని దర్శించుకున్న కిషన్ రెడ్డి

central-minister-kishan-reddy-visits-amberpet

అంబర్ పేటలోని మహంకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు.. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత అంబర్ పేట్ నియోజకవర్గం తులసి రామ్ నగర్, లంక బస్తీలలో పాద యాత్ర నిర్వహించారు కిషన్ రెడ్డి. పాద యాత్రకు మంగళ హారతులతో బస్తీవాసులు స్వాగతం పలికారు. తాను ఎప్పటికీ అంబర్ పేట్ బిడ్డనే అన్నారు కిషన్ రెడ్డి. పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం నరేంద్ర మోడీ చర్యలు తీసుకుంటున్నారన్నారు.

Latest Updates