కనకదుర్గ ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవ తేదీ ఖరారు

అమరావతి: విజయవాడ నగర వాసులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కనకదుర్గ ఫ్లైఓవర్‌ను ఈనెల 18న ప్రారంభించనున్నారు. కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ నెల 18వ తేదీన ఫ్లైఓవర్ ను ప్రారంభిస్తార‌ని ఎంపీ కేశినేని నాని తెలిపారు. 18 సెప్టెంబర్, 2020 తేదీన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా ఫ్లైఓవర్ ప్రారంభోత్స‌వం జరగనుందని కేశినేని నాని ట్విట్టర్ వేదికగా ఖరారు చేశారు. తొలుత ఈనెల 4నే ప్రారంభించాలని భావించినప్పటికీ మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అస్తమయం వల్ల వాయిదా పడింది. అందుకే తాజాగా కొత్త తేదీని నిర్ణయించారు. దీనితో ప్రచారంలో ఉన్న వివిధ పత్రికలలో చక్కర్లు కొడుతున్న తేదీలు అవాస్తవమని తేలింది.

central minister Nitin Gadkari will inaugurate the Kanaka Durga flyover on september 18th

Latest Updates