బంపర్ ఆఫర్ : మార‌టోరియం రుణాలపై వ‌డ్డీ ర‌ద్దు చేసిన కేంద్రం

కరోనా క్రైసిస్ నేపథ్యంలో కేంద్రం బంపర్ ఆఫర్ ప్రకటించింది. కరోనా వైరస్ నేపథ్యంలో అమలు చేసిన రుణాల మారటోరియం సమయంలో వడ్డీని మాఫీ చేస్తున్నట్లు  కేంద్రం కీలక ప్రకటన చేసింది.

లాక్ డౌన్ కారణంగా కోట్లాది మంది ఉపాధిని కోల్పోయి రోడ్డున పడ్డారు. దీంతో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కోల్పోయి..నెల నెల చెల్లించే ఈఎంఐలు సైతం చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు.

ఇప్పటికే కరోనా వైరస్ నేపథ్యంలో ఆర్బీఐ ప్రకటించిన మారటోరియం పథకం కింద రూ .2 కోట్ల వరకు రుణాలపై వీలైనంత త్వరగా వడ్డీ మినహాయింపును అమలు చేయాలని ఇటీవల సుప్రీంకోర్టు..,కేంద్రానికి  ఆదేశాలు జారీ చేసింది.  ఆదేశాలకు అనుగుణంగా కేందం తాజాగా 6 నెలల కాలానికి మార్చి1,2020 నుంచి ఆగస్టు 31 వరకు 2 కోట్ల రూపాయలకు మించని హౌసింగ్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, క్రెడిట్ కార్డు రుణాలు, వెహికల్ లోన్స్, ఎంఎస్ఎంఈ రుణాలపై వడ్డీ మీద వడ్డీ మాఫీ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు బ్యాంకులు, ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థలు వడ్డీ డబ్బులను కస్టమర్ల లోన్ అకౌంట్‌లో జమ చేస్తాయి. అనంతరం కేంద్రం నుంచి ఆయా బ్యాంకులు వసూలు చేసుకోనున్నాయి.  ఈ నిర్ణయం వల్ల కేంద్ర ప్రభుత్వానికి రూ.6,500 కోట్లు అదనపు భారం పడనుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు పేర్కొన్నారు.

Latest Updates