పాత వాహనాలపై గ్రీన్‌ ట్యాక్స్‌

అన్ని రకాల వాహనాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లైఫ్ టైం పూర్తయిన..పొల్యూషన్ వాహనాలపై గ్రీన్‌ ట్యాక్స్‌ వేయాలని కేంద్రం ప్రతిపాదించింది. అలాగే జీవిత కాలం పూర్తయిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వాహనాలను తొలగించే ప్రతిపాదనను కూడా కేంద్ర రోడ్డు రవాణా, హైవేస్‌ శాఖ ప్రతిపాదించింది. వీటిపై సంప్రదింపులు జరిపిన తర్వాత నిబంధనలను నోటిఫై చేస్తుంది. దీనికి సంబంధించి రాష్ట్రాలకు ప్రతిపాదనలు పంపింది. వాహనాలు ఫిటినెస్‌ సర్టిఫికెట్‌ దరఖాస్తు చేసుకునే సమయంలో 50 శాతం గ్రీన్‌ ట్యాక్స్‌ వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

అంతేకాదు జీవిత కాలం పూర్తయిన వ్యక్తిగత వాహనాలను కూడా తొలగించే ప్రయత్నంలో భాగంగానే గ్రీన్‌ ట్యాక్స్‌ తీసుకురానున్నట్లు రోడ్డు రవాణా శాఖ తెలిపింది. అయితే వ్యక్తిగత, వాణిజ్య, రవాణా వాహనాలను తొలగించే అంశంపై నిబంధనలు ఇంకా రెడీ కాలేదని చెప్పింది.

Latest Updates