కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లకు శుభవార్త. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం(DA) చెల్లింపుపై 7వ వేతన ఒప్పందం సంఘం సిఫార్సులను కేంద్రం పరిగణలోకి తీసుకుంది. DA పెంచుతూ కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 17 శాతంగా ఉన్న డీఏను 28 శాతానికి పెంచేందుకు ఆమోదం తెలిపింది. ఈ ఏడాది జులై 1 నుంచి ఈ పెంపుదల వర్తించనుందని కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు.

డీఏ పెంపుతో రూ.34,400 కోట్ల వరకు ఖజానాపై భారం పడనుంది. కేబినెట్‌ నిర్ణయంతో 48.34 లక్షల మంది ఉద్యోగులు, 65.26 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. కరోనా కారణంగా 2020 జనవరి 1, 2021 జులై 1, 2021 జనవరి 1న చెల్లించాల్సిన డీఏలు నిలిచిపోయాయి. ఆగిపోయిన కాలానికి ఎలాంటి ఎరియర్స్‌ చెల్లించడం లేదని కేంద్రం స్పష్టం చేసింది.