ప్రభుత్వం వెంటే మేము: ప్రతిపక్ష నేతలు

ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు ..ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా … అండగా ఉంటామన్నారు అఖిలపక్ష నేతలు. టెర్రరిస్టు స్థావరాలపై  వైమానిక దళాలు జరిపిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. వైమానిక దాడులపై.. ప్రభుత్వం అఖిలపక్షానికి వివరించింది. నాన్  మిలటరీ అపరేషన్  జరిగినట్లు, జైషే మహ్మద్  ఉగ్రవాద శిబిరాలే టార్గెట్ గా దాడిచేశామని ప్రభుత్వం వివరించింది. విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ నేతృతంలో జరిగిన ఈ భేటీకి కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అరుణ్ జైట్లీ, రాజ్ నాథ్ సింగ్ , విజయ్ గోయల్ తో పాటు ఆజాద్, ఒమర్ అబ్దుల్లా, డీ రాజా, సీతారాం ఏచూరి, ఇతర పార్టీల నేతలు పాల్గొన్నారు.

Latest Updates