పశ్చిమ బెంగాల్ పేరు మార్చలేం

  • రాజ్యాంగ సవరణతోనే సాధ్యం
  • మమత సర్కారుకు తేల్చి చెప్పిన కేంద్రం

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ పేరును ‘బంగ్లా’ గా మార్చాలన్న మమత సర్కారు ప్రతిపాదనను కేంద్ర హోంశాఖ బుధవారం తోసిపుచ్చింది. అసెంబ్లీ తీర్మానంతో రాష్ట్రం పేరు మార్చలేమని, రాజ్యాంగ సవరణతోనే అది సాధ్యమని తేల్చిచెప్పింది. 2018 జూలైలో రాష్ట్రం పేరు మార్చాలంటూ పశ్చిమ బెంగాల్​అసెంబ్లీ తీర్మానం చేసింది. ఆల్ఫాబెటికల్​ఆర్డర్​కారణంగా పార్లమెంటులో రాష్ట్ర సమస్యలు చివర్లో చర్చకు వస్తున్నాయని సీఎం మమతా బెనర్జీ పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతోపాటు రాష్ట్రం పేరు మార్చాలన్న డిమాండ్​ప్రజల్లో బలంగా ఉందని ఆమె చెప్పారు. గతంలో రాష్ట్రం పేరును ఇంగ్లిష్​లో బెంగాల్, బెంగాలీలో బంగ్లా, హిందీలో బంగాల్​గా మార్చాలని అసెంబ్లీ తీర్మానం చేసి పంపగా కేంద్రం ఒప్పుకోలేదని గుర్తుచేశారు. మూడు భాషల్లో మూడు పేర్లతో వ్యవహరించడం సాధ్యం కాదని అభ్యంతరం చెప్పిందన్నారు. ఈ క్రమంలో బంగ్లా అంటూ ఒకే పేరును ఖరారుచేస్తూ అసెంబ్లీ తీర్మానం చేసి పంపినట్లు మమత చెప్పారు. తాజాగా, ఈ ప్రతిపాదనను కూడా కేంద్రం తిరస్కరించింది. ఇప్పటికే పలు అంశాలపై మమత సర్కారుకు, కేంద్రానికి మధ్య విభేదాలుండగా.. తాజా తిరస్కరణ మరో కొత్త వివాదానికి దారితీయనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Latest Updates