చైనాకు గట్టి సందేశం ఇవ్వాలి: ప్రియాంకా గాంధీ

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం బలహీనమైన వ్యూహాన్ని అవలంబిస్తోందని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ ఆరోపించారు. చైనాతో రైల్వే కారిడార్ ఒప్పందం ద్వారా బీజేపీ ప్రభుత్వం ఆ దేశం ముందు మోకరిల్లిందని ఆమె ఆరోపించారు. ‘‘సైనికులు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో మన దేశం.. చైనాకు బలమైన సందేశం ఇవ్వాలి. కానీ ఢిల్లీ లోని మీరట్ సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్ ఒప్పందాన్ని ఆ దేశానికి అప్పగించడం ద్వారా ప్రభుత్వం ఒక బలహీనమైన వ్యూహాన్ని అనుసరించింది. ఇండియాలో ఎన్నో కంపెనీలు ఈ కారిడార్‌ను నిర్మించడానికి కావాల్సిన కెపాసిటీని కలిగి ఉన్నాయి”అని ప్రియాంకా గురువారం ట్వీట్ చేశారు. ఈ ఒప్పందంతో చైనా కంపెనీకి మన దేశం 1,126 కోట్ల రూపాయల కాంట్రాక్టు అప్పగించిందని మండిపడ్డారు.

Latest Updates