రాష్ట్రాల హక్కులు, ఫెడరలిజం స్ఫూర్తికి కేంద్రం తూట్లు

న్యూఢిల్లీ: కేంద్ర సర్కార్ కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై రగడ నడుస్తోంది. ఈ బిల్లులకు నిరసనగా కేంద్ర మంత్రి హర్‌‌సిమ్రత్ కౌర్ తన పదవికి రాజీనామా చేశారు. అలాగే బిల్లుకు వ్యతిరేకంగా పంజాబ్‌‌లో మూడ్రోజుల పాటు రైల్ రోకోకు అక్కడి రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ విషయంపై తాజాగా కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం స్పందించారు. ఒకవైపు రైతులకు సంబంధించిన రెండు బిల్లులను లోక్ సభలో ఆమోదించగా.. మరోవైపు రైతులు దీన్ని వ్యతిరేకిస్తూ నిరసనలకు దిగుతున్నారని చిదంబరం దుయ్యబట్టారు. ఇది ప్రజలు, ప్రభుత్వానికి మధ్య ఉన్న దూరాన్ని ప్రతిఫలిస్తోందన్నారు.

‘కొత్త వ్యవసాయ బిల్లులు ఇండియా ఫుడ్ సెక్యూరిటీ సిస్టమ్‌‌ను సవాల్ చేస్తున్నాయి. ఎంఎస్‌‌పీ, పబ్లిక్ ప్రొక్యూర్‌‌మెంట్, పీడీఎస్‌‌ను కొత్త వ్యవసాయ బిల్లులు చాలెంజ్ చేస్తున్నాయి. ఈ బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానాల్లో రైతులు వీధుల్లోకి వచ్చి నిరసనలకు దిగుతున్నారు. తమ ఉత్పత్తులకు ఎంఎస్‌‌పీ కంటే ఎక్కువ ధర వస్తుందని రైతులకు హామీ ఇవ్వడంలో బిల్లులు ఫెయిలయ్యాయి. రాష్ట్రాలతో సంప్రదింపులు జరపకుండా కొత్త బిల్లులు తీసుకురావడం ద్వారా స్టేట్స్ రైట్స్, ఫెడరలిజం స్ఫూర్తికి బీజేపీ సర్కార్ తూట్లు పొడిచింది’ అని చిదంబరం పేర్కొన్నారు.

Latest Updates