కమల్ హాసన్ కు సెంచూరియన్ వర్శిటీ డాక్టరేట్

నటుడు కమల్ హాసన్ కు అవార్డులు అందుకోవడం కొత్తేమీ కాదు. ఇప్పటికే ఎన్నో అవార్డులు..బిరుదులను సొంతం చేసుకున్నారు. విశ్వ నటుడు అనే బిరుదుతో ఆయన పేరుకి మరింత గౌరవాన్ని తెచ్చిపెట్టింది. లేటెస్ట్ గా కమల్ కు మరో గౌరవం దక్కింది.  కమలహాసన్ ను గౌరవ డాక్టరేట్ తో ఒడిశాలోని ప్రైవేట్ విశ్వవిద్యాలయం సత్కరించింది. సెంచూరియన్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ను కమలహాసన్  అందుకున్నారు. భువనేశ్వర్ లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్… కమల్ కు డాక్టరేట్ ప్రదానం చేశారు.

Latest Updates