సెంచరీతో చెలరేగిన కోహ్లీ..విండిస్ పై అరుదైన రికార్డ్

పోర్ట్ ఆఫ్ స్పెయిన్ :  పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డుకెక్కాడు. విండీస్‌ తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ చేయడమే కాక.. ఈ మ్యాచ్ లో విండీస్ పై అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్ మెన్ గా రికార్డు సాధించాడు. 112 బాల్స్ లో 10 ఫోర్లు, సిక్సర్‌ తో సెంచరీ చేశాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 42వ సెంచరీ.

38 ఓవర్లు పూర్తయ్యే సరికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 195 రన్స్ చేసింది. కోహ్లీ 102, అయ్యర్ 44 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇద్దరూ కలిసి 101 బంతుల్లో 101 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.

Latest Updates