6 నెలలు కష్టంగా గడిచింది

ధర్మశాల: గాయంతో టీమ్ కు 6 నెలలు దూరం కావడం చాలా కష్టంగా గడిచిందని తెలిపాడు టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా. గాయం నుంచి కోలుకుని తిరిగి టీమ్ లోకి చేరిన పాండ్యాను, చాహల్ ఇంటర్వ్యూ చేశాడు. టీమ్ కు దూరంగా ఉండటం మానసికంగా బాధేసిందని తెలిపిన పాండ్యా.. ఈ గ్యాప్ లో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయన్నాడు. త్వరగా కోలుకోవాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదని చాహల్ ప్రశ్నలకు సమాధానం తెలిపాడు పాండ్యా.

ఈ వీడియోను BCCI ట్విట్టర్ లో పోస్ట్ చేయగా.. ఆల్ ద బెస్ట్ పాండ్యా అంటూ అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు. అయితే గురువారం సౌతాఫ్రికాతో జరగాల్సిన ఫస్ట్ వన్డేకు వర్షం అడ్డంకిగా మారింది. మ్యాచ్ టైమ్ కి వర్షం రావడంతో టాస్ వేయడం నిలిపివేశారు అంపైర్లు. వర్షం తగ్గితే ఓవర్లను తగ్గించి మ్యాచ్ స్టార్ట్ చేస్తామని తెలిపారు.

Latest Updates