చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్: భారీగా గోల్డ్ సీజ్

V6 Velugu Posted on Dec 01, 2021

మహబూబాబాద్ : వరుస చైన్ స్నాచింగ్స్ కు పాల్పడుతున్న 8 మంది సభ్యులున్న అంతర్ జిల్లా చైన్ స్నాచింగ్ ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు పోలీసులు. వారి వద్ద నుండి 13 స్నాచింగ్ లకు  చెందిన మొత్తం 18 లక్షల  విలువైన 30 తులాల బంగారు ఆభరణాలను, 4 బైకులను స్వాధీనం చేసుకున్నట్లు మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ కోటిరెడ్డి వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్ ccs తొర్రుర్ పోలీసులు సంయుక్తంగా సీసీ ఫుటేజీల ఆధారంగా అనుమానితులను వెతుకుచుండగా తొర్రుర్ శివారు పాల కేంద్రం వద్ద 4 బైకులు పై 8 మంది అనుమానాస్పదముగా ఉండడం తో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా నిందితులు గత రెండు సంవత్సరాలు గా మహబూబాబాద్ ,సూర్యాపేట , ఖమ్మం జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో 13 స్నాచింగ్ లకు పాల్పడ్డారని ,వీరు ముఖ్యంగా ఒంటరి గా ఉన్న వృద్ధ మహిళలను టార్గెట్ చేసి స్నాచింగ్ కు పాల్పడే వారని ,ఇద్దరిద్దరుగా విడిపోయి స్నాచింగ్ చేసే వారేనని తెలిపారు.నిందితులందరు 21-27 సంవత్సరాల యువకులు వెల్లడించారు.

Tagged Arrested, mahabubabad, chain snatching, Siege, , Heavy gold

Latest Videos

Subscribe Now

More News