చలో ట్యాంక్ బండ్ సక్సెస్ : కోదండ రామ్

హైదరాబాద్ : చలో ట్యాంక్ బండ్ సక్సెస్ అయ్యిందన్నారు కోదండరాం. ఎన్నో ఆంక్షల మధ్యన ఆర్టీసీ కార్మికులు ట్యాంక్ బండ్ ను టచ్ చేశారని తెలిపారు. అనేకమంది కార్మికులు ట్యాంక్ బండ్ ని చేరుకుని నిరస తెలపడంతో చలో ట్యాంక్ బండ్ కార్యక్రమం సంపూర్ణంగా విజయవంతం అయ్యిందని చెప్పారు.

పోలీసులు దౌర్జన్యంగా అరెస్టులు చేశారని మహిళలు అని కూడా చూడకుండా లాక్కెళ్లడం దారుణమన్నారు కోదండ రాం. కార్మికులను ఇష్టంవచ్చినట్లు పోలీసులు కొట్టారన్నారు. ఎంతకష్టంమైనా భరిస్తూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన ఆర్టీసీ కార్మికులకు అభినందనలు చెప్పారు కోదండరాం.

Latest Updates