కిరాణా కొట్టు బాకీలు వసూల్ చేసిన వ్యక్తే.. స్టేట్ బ్యాంక్ రికవరీ హెడ్

రికవరీల్లో టాప్ స్టేట్ బ్యాంక్ ఎండీ చల్లా శ్రీనివాసులు శెట్టి
చిన్నతనం నుంచే రికవరీలో మెళకువలు
ఎస్‌‌బీఐ రికవరీ హెడ్‌గా నియామకం
కరోనా లాక్‌డౌన్‌‌తో పెరుగుతున్న మొండిబకాయిలు
సవాలుగా నిలుస్తున్న మారటోరియం

‘ప్రాబ్లమ్‌‌ను గుర్తిస్తే.. దాన్ని పరిష్కరించే విషయంలో బారోవర్‌కు నువ్వు సాయం చేయొచ్చు. సరియైన యాక్షన్ ప్లాన్లను అమలు చేయొచ్చు. ప్రమోటర్‌తో కూర్చుని, సొల్యుషన్ కోసం వెతకాలి. చిన్నతనంలో నేర్చుకున్న మెళకువలతోనే ఇప్పటికీ లోన్ల రికవరీ ఫీల్డ్‌‌లో రాణిస్తున్న’.

వెలుగు, బిజినెస్ డెస్క్: స్కూల్ హాలిడేస్‌‌లో తండ్రి కిరాణా దుకాణానికి బాకీలు వసూలు చేసిన చల్లా శ్రీనివాసులు శెట్టి.. ఇప్పుడు లోన్ల రికవరీ కింగ్‌‌గా నిలుస్తున్నారు. దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్‌బీఐకి ఉన్న ముగ్గురు మేనేజింగ్ డైరెక్టర్లలో ఒకరిగా లోన్లరికవరీ హెడ్‌గా నియమితులయ్యారు. తెలుగువాడైన శ్రీనివాసులు శెట్టి.. స్కూల్ హాలిడేస్‌ అంతా తండ్రి కిరాణా దుకాణానికి అప్పులున్నవారి నుంచి డబ్బులు వసూలు చేసి తీసుకురావడమే. తను, వారి అన్న ఇద్దరూ కలిసి రైతుల నుంచి వసూళ్లు చేపట్టేవారు. అక్కడి నుంచి అప్పులు ఎలా వసూలు చేయాలో మెళకువలు నేర్చుకున్న శ్రీనివాసులు శెట్టి.. మెల్లమెల్లగా అదే సెగ్మెంట్‌‌లో కింగ్‌‌గా నిలుస్తున్నారు. నలభై ఏళ్ల తర్వాత కూడా అప్పులు వసూలు చేస్తూ ఎస్‌బీఐ టాప్ జాబ్‌ను పట్టేశారు. బ్యాంక్‌‌లకు బ్యాడ్ లోన్లను రికవరీ చేయడం అతిపెద్ద ఛాలెంజ్‌. ఇక ఎస్‌బీఐ లాంటి బ్యాంక్‌‌లకు అయితే ఇదెంత ఇంపార్టెంటో చెప్పక్కర్లేదు. 19.6 బిలియన్ డాలర్ల బ్యాడ్‌ లోన్స్ ఉన్న ఎస్‌బీఐకి రికవరీ హెడ్‌గా శ్రీనివాసులు ఉన్నారు. ఈ టైమ్‌‌లో ఇది చాలా కష్టమైన పనే. ఇండియాలో బ్యాడ్‌లోన్ రేషియో ఇప్పటికే చాలా ఎక్కువగా ఉంది. కరోనా వైరస్ లాక్‌‌డౌన్ ప్రభావంతో మొండి బకాయిలు మరింత పెరిగి పోనున్నాయని అంచనాలున్నాయి. లాక్‌‌డౌన్‌తో చాలా వ్యాపారాలు మూతపడ్డాయి. లక్షల మంది నిరుద్యోగులుగా మారారు. అయితే అప్పులు వసూలు చేయడంలో రెండు అతి ముఖ్యమైన పాఠాలను తన తండ్రి దగ్గర్నుంచి నేర్చుకున్నానని శ్రీనివాసులు చెబుతారు. ఇందులో మొదటిది టైమ్ వాల్యు … ఎంత త్వరగా మనీని రికవరీ చేయగలమనేదే అతి ముఖ్యమైనదని శ్రీనివాసులు ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. శ్రీనివాసులు జనవరిలోనే ఎస్‌బీఐ మేనేజింగ్ డైరెక్టర్‌‌‌‌గా ప్రమోట్ అయ్యారు. ఇక రెండోది, ఫాలో అప్‌‌ అని తెలిపారు. బకాయిల రికవరీలో ఫాలో అప్‌‌ అనేది కూడా చాలా ఇంపార్ట్‌టెంట్ అన్నారు.

మారటోరియంతో అంచనా వేయలేకున్నాం..
మరోవైపు బ్యాంకర్లు కూడా తమ లోన్ బుక్స్‌‌ను అంచనావేయడంలో ఇబ్బందులు పడుతున్నారు. గత మూడు నెలలుగా చాలా మంది లోన్‌ రీపేమెంట్లలో మారటోరియాన్ని ఎంచుకున్నారు. ఈ లోన్ల రీపేమెంట్ మారటోరియం ఆగస్ట్‌‌తో కానీ ముగియదు. ఈ సమయంలో లోన్ బుక్స్‌‌ను అంచనా వేయడం బ్యాంకర్లకు కాస్త కష్టతరమే. ఎస్‌బీఐ రిటైల్ కస్టమర్లలో 21 శాతం, కార్పొరేట్ బారోవర్స్‌‌లో 10 శాతం మంది మారటోరియం ఆప్షన్‌ను ఎంచుకున్నట్టు శెట్టి తెలిపారు. కార్పొరేట్ బుక్స్ కంటే రిటైల్ లోన్ల రికవరీ అవుట్‌లుక్ చాలా మెరుగ్గా ఉందని చెప్పారు. తమ టీమ్‌ను ఫాలో అప్ సూత్రాన్ని ఎంచుకుని పనిచేయాలని చెప్పినట్టు పేర్కొన్నారు. లోన్ మారటోరియంలో ఉన్న ఇంప్లికేషన్లను కూడా రిటైల్ కస్టమర్లకు ఎస్‌బీఐ వర్కర్లు వివరిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటి వరకు లక్ష మందికి పైగా రిటైల్ కస్టమర్లకు లోన్ మారిటోరియంపై అవగాహన కల్పించారు. రీపేమెంట్ చేసే అవకాశం ఉన్నా కూడా ఎకానమీలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులతో రిటైల్ కస్టమర్లు చాలా మంది మారటోరియం ఎంపిక చేసుకున్నట్టు ఈ అవగాహన కార్యక్రమాలలో తమకు అర్థమైందని అన్నారు.

బ్యాంకింగ్ సిస్టమ్‌‌లో 1.37 ట్రిలియన్ డాలర్ల లోన్లు..
ఎస్‌‌బీఐలో32 ఏళ్ల నుంచి పనిచేస్తో న్నశెట్టి స్ట్రెస్డ్ అసెట్ మేనేజ్‌‌మెంట్‌ బాధ్యతలను నిర్వరిస్తున్నారు. అంటే బ్యాడ్‌‌లోన్ రికవరీ, రిటైల్,డిజిటల్ బ్యాంకింగ్‌‌కు హెడ్‌‌గా ఉన్నారు. మొత్తం ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్‌‌లోని 1.37ట్రిలియన్ డాలర్ల అవుట్‌‌స్టాండింగ్ లోన్లలో ఐదో వంతు ఎస్‌‌బీఐ అకౌంట్స్‌‌వే ఉన్నాయి. ఎప్పటి నుంచో పెండింగ్‌‌లో ఉన్న లోన్ల విషయంలో తాము వన్‌ టైమ్ సెటిల్‌‌మెంట్లను ప్రిఫర్ చేస్తామని శెట్టి చెప్పారు. ఇదేతమ తొలి సూత్రమని పేర్కొన్నారు. చిన్న,మధ్య స్థాయి అకౌంట్లు అయితే డిఫాల్టర్స్‌‌ను ఫాలో అప్ చేయడం రెండో విషయమని చెప్పారు. ఎస్‌‌అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్, మెకిన్సే అండ్ కో అంచనాలప్రకారం దేశంలో మొండి బకాయిల రేషియో 9.3శాతం ఉండగా..అది తాజాగా మరో 7 శాతం పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

For More News..

పాక్‌ టీమ్‌లో ముగ్గురికి కరోనా

ఉమెన్స్ టీ20 వరల్డ్‌‌కప్‌ రికార్డు

లాక్‌‌డౌన్ సడలించినా షాపింగ్ చేయట్లే..

Latest Updates